కళ్యాణ్ రామ్ చెప్పిన నిజం ఇదీ.. !

 Posted October 21, 2016

kalyan ram said about his market ism movie

నందమూరి కళ్యాణ్ రామ్.. కెరీర్ ఆరంభంలోనే “అతనొక్కడే” లాంటి సూపర్ హిట్ కొట్టి తనని తాను నిరూపించుకున్నాడు.’అతనొక్కడే’ తర్వాత ‘పటాస్’ వరకు అన్ని ప్లాపులే. దాదాపు పదేళ్ల తర్వాత ‘పటాస్’తో అదరగొట్టాడు. మళ్లీ నిలబడ్డాడు.

అయితే, ఈ గ్యాప్ లో కళ్యాణ్ సినిమాలన్నీ ప్లాప్ లైన్ లోకి క్యూకట్టాయి. ఓం 3డి, కిక్ 2 లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఫట్టుమన్నాయి. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ పనైపోయింది. ఆయన ఆర్థిక పరిస్థితి మరేం బాగులేదు. అప్పుల్లో మునిగిపోయాడని.. ఇలా చాలా వినిపించాయి. అంతేకాదు.. కళ్యాణ్ రామ్ ని జూ.ఎన్టీఆర్ ఆదుకొన్నాడని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడీ వార్తలపై స్పదించాడు కళ్యాణ్.

కళ్యాణ్ రామ్ అయిపోయాడు. అప్పుల్లో మునిగిపోయాడు.. ఈ వార్తలన్నీ కేవలం ఊహాగానాలే. నిజంగా నేను అలాంటి పరిస్థితుల్లోనే ఉంటే ఇంకో సినిమా ఎలా చేయగలను. నా మార్కెట్ నాకు తెలుసు. దానికి తగ్గట్టే సినిమాలు చేస్తున్నా. అయితే, అప్పుడప్పుడు కథని బట్టి అటు ఇటు అవ్వడం కామన్. అని క్లారిటీ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. అంతేకాదు.. ఇజం’ సినిమా బడ్జెట్ 25 కోట్లు అయిందని, బిజినెస్ మాత్రం 20 కోట్లకు జరిగిందని అంటున్నారు. ఈ రూమర్ పై కూడా నిజం చెప్పాడు కళ్యాణ్. ఇందులో నిజం లేదు. తన మార్కెట్ కి తగ్గుట్టుగానే ఖర్చు పెట్టామని తెలిపారు.

SHARE