పూరి గురించి కళ్యాణ్ గంటసేపు.. ఏం మాట్లాడుతాడో ?

Posted October 6, 2016

 kalyan ram said talking one hour puri jagannath

పూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం “ఇజం”. ఈ సినిమా ఆడియో వేడుక బుధవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. నందమూరి బ్రదర్స్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తండ్రి హరీకృష్ణ ఆడియో వేడుకలో సరదాగా కనిపించారు. అయితే, ‘ఇజం’ ఆడియో వేదికగా ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఏంటో తెలిసిపోతుందని ఆశపడ్డ నందమూరి అభిమానులకి నిరాశే ఎదురైంది. తన సినిమాలపై తారక్ నోరు తెరవలేదు.

ఇక, ‘ఇజం’హీరో కళ్యాణ్ రామ్ మాత్రం పెద్ద సస్పెన్స్ ని క్రియేట్ చేశాడు. దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి గంటసేపు మాట్లాడతాను. కానీ, ఇప్పుడు కాదు. ‘ఇజం’ రిలీజ్ రోజున అంటూ సస్పెన్స్ లో పెట్టేశాడు. ఇప్పుడంతా.. పూరి గురించి కళ్యాణ్ గంటసేపు ఏం చెబుతాడబ్బా.. ? అంటూ తలలు పట్టుకొంటున్నారు. పూరి గురించి కళ్యాణ్ ఏం చెప్పబోతున్నాడో తెలియాలంటే ఇజం వచ్చే వరకు ఆగాల్సిందే.

SHARE