బాహుబలి-2 ట్రైలర్ తో గుండెలు అదిరిపోయాయట

0
649
kalyan ramana feeling thrilled after watching baahubali 2 trailer

Posted [relativedate]

kalyan ramana feeling thrilled after watching baahubali 2 trailerబాహుబలి-1 క్రియేట్ చేసిన వండర్స్ తో బాహుబలి-2పై అంచానాలు తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి-1 సాధించిన రికార్డ్స్ ని బాహుబలి-2తో అధిగమించడానికి చిత్రయూనిట్ తెగ కష్టపడుతోంది. ఏప్రిల్-28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఈ సినిమా పబ్లిసిటీ పనులను కూడా చక్కబెట్టేస్తున్నాడు రాజమౌళి. ఇందులో భాగంగానే ప్రభాస్ కు సంబంధించిన కొన్ని పోస్టర్ లను విడుదల చేసిన చిత్ర యూనిట్ త్వరలోనే ట్రైలర్ ను కూడా  భారీ స్థాయిలో విడుదల చేసేందుకు  ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్ర ట్రైలర్ ని ముంబై వేదికగా ఈ నెల 15 న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర  ట్రైలర్ ని చూసిన రాజమౌళి సోదరుడు, సంగీత దర్శకుడైన  కళ్యాణ్ రమణ..  సోషల్ మీడియాలో  స్పందించారు. “ట్రైలర్ చూసి నా గుండెలు అదిరిపోయాయ్… సినిమాతో సంబంధం లేకుండ ఇది విడిగా 100 రోజులు ఆడుతుంది”  అంటూ ఆయన ఫేస్ బుక్ లో కామెంట్ పెట్టారు. ఈ చిత్రానికి సౌండ్ ఎడిటర్ గా కూడా పనిచేసిన కళ్యాణ్  రమణే స్వయంగా ఈ కామెంట్ పెట్టడంతో తారాస్థాయిలో ఉన్న అంచానాలు మరో మెట్టు ఎక్కినట్లైంది. 

Leave a Reply