ఎన్టీఆర్ యాక్టింగ్ కి కమల్ ఫిదా..

Posted October 10, 2016

  kamal hassan appreciated ntr acting
జనతా గ్యారేజ్ కమర్షియల్ గానే కాకుండా ఎన్నో తీపి అనుభూతుల్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి పంచుతోంది.ఇటీవలే ఈ సినిమా చూసిన రజని ఎన్టీఆర్ నటనకి ప్రశంసలు కురిపించారన్న వార్తలు విన్నాం.ఇంతలోనే కమల్ హాసన్ కూడా యంగ్ టైగర్ యాక్టింగ్ స్కిల్స్ కి పడిపోయాడట.ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోనే ఉంటున్న కమల్ వరసబెట్టి అన్ని సినిమాలు చూసేస్తున్నాడు.ఆలా జనతా గ్యారేజ్ కూడా కూతురు శృతి తో కలిసి చూశాడంట.సినిమా చూస్తున్నంత సేపు ప్రతి షాట్ లో ఎన్టీఆర్ ని పొగుడుతూనే ఉన్నారట.ఈ విషయాన్నే శృతి ఫోన్ చేసి ఎన్టీఆర్ కి చెప్పిందట.దీంతో ఎన్టీఆర్ ఆనందానికి అవధుల్లేవు.దేశమంతా మెచ్చే అంతర్జాతీయ స్థాయి నట దిగ్గజానికి తన నటన నచ్చడం ఒక్క ఎన్టీఆర్ కే కాదు.కోట్లాదిమంది అభిమానులకి కూడా పండగలాంటి వార్త .

SHARE