ఏంటి కమల్‌ ఇలా అంటున్నావ్‌..!

Posted May 26, 2017 at 19:39

kamal hassan comments on rajinikanth political entryసూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయాల్లోకి రావడం ఖాయం అయ్యింది. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలోనే ఆయనకు మద్దతు ఇచ్చేవారు ఇస్తున్నా, విమర్శలు చేసేవారు చేస్తున్నారు. రజినీకాంత్‌ అభిమానులు ఆయన పొలిటికల్‌ ఎంట్రీ గురించి ఒక క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పండగ చేసుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం రజినీకాంత్‌ రాజకీయాల్లోకి రావడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా రజినీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారంను రేపుతున్నాయి. కమల్‌ హాసన్‌ తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ రజినీకాంత్‌ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రజినీకాంత్‌ అప్పుడప్పుడు ఇలాంటి సందడి చేయడం కామన్‌ అని, ఆయన కెమెరాల ముందుకు వస్తే పూనకం వచ్చిన వాడిగా ఊగిపోతాడు. ఎక్కడ కెమెరాలు కనిపిస్తే అక్కడ ఆగిపోతాడు. రజినీకాంత్‌ రాజకీయ ప్రవేశంకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన రాని నేపథ్యంలో కమల్‌ చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. కొందరు రజినీకాంత్‌ అభిమానులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మరి కొందరు మాత్రం కమల్‌ ఎందుకు ఇలా మాట్లాడి ఉంటాడు అని ఆలోచిస్తున్నారు. అయితే ఎక్కువ శాతం మంది మాత్రం కమల్‌ అలా రజినీకాంత్‌ గురించి వ్యాఖ్యలు చేసి ఉండకూడదు అంటున్నారు.

SHARE