Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం దాదాపుగా ఖాయం అయ్యింది. గత కొంత కాలంగా వస్తున్న వార్తలకు తాజాగా రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఫుల్‌స్టాప్ పెట్టినట్లయ్యింది. రజినీకాంత్ త్వరలోనే బీజేపీలో జాయిన్ అవ్వడం ఖాయంమని, వచ్చే పార్లమెంటు ఎన్నికలు మరియు ఆ తర్వాత వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజినీకాంత్ తన సత్తా చాటడం ఖాయంగా తమిళ రాజకీయ వర్గాల వారు చెబుతున్నారు. ఇటీవల ఫ్యాన్స్ మీట్‌లో రజినీకాంత్ మాట్లాడుతూ దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తాను అంటూ ప్రకటించిన నేపథ్యంలో ఆయన సహ నటుడు కమల్ హాసన్ కాస్త వింతగా స్పందించాడు.
తమిళనాడులో ఇద్దరు కూడా స్టార్ హీరోలు. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అని చెప్పడానికి లేదు. వీరిద్దరు మంచి స్నేహితులు కూడా. అయితే రజినీకాంత్ తీసుకున్న నిర్ణయాన్ని కమల్ హాసన్ కాస్త వ్యతిరేకిస్తున్నాడు. తమిళనాడు ప్రజలకు ప్రాంతీయ భావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు జాతీయ పార్టీలకు ఇక్కడ స్థానం కల్పించరు. రజినీకాంత్ బీజేపీతో జత కట్టడం కూడా తమిళ ప్రజలకు నచ్చక పోవచ్చు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కమల్ అభిప్రాయం ప్రకారం రజినీకాంత్ సొంతంగా పార్టీ పెడితే మంచి ఫలితం ఉండవచ్చు. ఇక ఆ పెట్టబోయే పార్టీని రజినీతో పాటు, కమల్ కూడా సారథ్యం వహిస్తే ఇక తమిళనాట ఆ పార్టీకి తిరుగు ఉండదు కావచ్చని తమిళ పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.