కమల్ ఇలాంటి వాడా..?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

kamal hassan controversy comments on rajinikanth political entryరజనీకాంత్‌కి కెమెరాలు ఎక్కడ వుంటాయో బాగా తెలుసు.. అంటూ సినీ నటుడు కమల్‌హాసన్‌, తన స్నేహితుడు తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఈ మధ్య సినిమా సెలబ్రిటీలకు గ్లామర్‌ తగ్గి, పొలిటికల్‌ సెలబ్రిటీలకు గ్లామర్‌ పెరిగింది మీడియా కవరేజ్‌ పరంగా. ఆ విషయం కమల్‌హాసన్‌కీ బాగా తెలుసు. కెమెరాలు ఎక్కడుంటాయో తెలుసు.. అనడంలోనే, కమల్‌హాసన్‌ తన తెలివితేటల్ని ఎంతగా ఉపయోగించాడో అర్థమవుతుంది. ఇది క్లియర్‌.. రజనీకాంత్‌ మీద కమల్‌హాసన్‌ సెటైర్‌ వేశాడు.

అయితే, రజనీకాంత్‌ మాత్రమేనా.? కమల్‌హాసన్‌కి కెమెరాలెక్కడుంటాయో తెలియదా.? ఈ ప్రశ్న పుట్టుకురావడం సహజమే. ఎందుకంటే, జల్లికట్టు పేరుతో కమల్‌హాసన్‌ చేసిన పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. తమిళ సినీ ప్రముఖులు పబ్లిసిటీ కోసం పాకులాడొద్దు.. జల్లికట్టు క్రెడిట్‌ మీ ఖాతాలో వేసుకోవద్దు.. అని సెటైర్లు వేస్తూనే, ఆ క్రెడిట్‌ని తన ఖాతాలో వేసుకోవడానికి పాకులాడిన ఘనుడు కమల్‌హాసన్‌.

రజనీకాంత్‌కి కమల్‌హాసన్‌ అత్యంత సన్నిహితుడు. ఇద్దరం కలిసి ఓ సినిమాలో నటిద్దాం.. అని మొన్నీమధ్యనే రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ అనుకున్నారు. అయితే, ఇప్పుడు రజనీకాంత్‌ చుట్టూ పొలిటికల్‌ వేవ్‌ కన్పిస్తోంది. ఆ వేవ్‌, సహజంగానే కమల్‌హాసన్‌కి ఇంపుగా అన్పించి వుండదు. అదీ, అక్కడ వచ్చింది తేడా.! ఒకరు మహా నటుడైతే, ఇంకొకరు సూపర్‌ స్టార్‌. ఈ ఇద్దరి మధ్యా పొలిటికల్‌ సెటైర్లు షురూ అవడం, అభిమానులకే పెద్ద షాకిచ్చింది.

Leave a Reply