కోట్ల పారితోషికాలు తీసుకునే హీరోలకు ఆర్థిక కష్టాలేంటో?

Posted April 18, 2017

kamal hassan faces financial problems
స్టార్‌ హీరోలు అంటే కోట్ల పారితోషికం అందుకుంటారు. ఇక తెలుగు మరియు తమిళంలో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న కమల్‌ హాసన్‌ వంటి వారు పదుల కోట్లలో పారితోషికాన్ని అందుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి మెప్పించి, భారీ వసూళ్లను రాబట్టిన కమల్‌ హాసన్‌ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. కోట్ల పారితోషికం తీసుకునే కమల్‌ ఎందుకు ఆర్థికంగా చితికి పోయాడు అనే విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

కమల్‌తో భారీ పారితోషికం ఇచ్చి మరీ సినిమాలు నిర్మించేందుకు పెద్ద నిర్మాతలు సిద్దంగా ఉంటారు. అయితే కమల్‌ వేరే బ్యానర్‌లో కంటే ఎక్కువగా సొంత బ్యానర్‌లోనే సినిమాలు చేశాడు. ఆ సినిమాల్లో ఎక్కువ శాతం ఫ్లాప్‌ అయ్యాయి. ఆ ఫ్లాప్‌ల వల్ల భారీ నష్టాలనే మూటకట్టుకున్నాడు. దాంతో ఇప్పుడు కమల్‌కు కష్టాలు వెన్నంటుతున్నాయి. ఆర్థిక కష్టాల నుండి బయట పడేందుకు బుల్లి తెరను కమల్‌ ఆశ్రయించబోతున్నట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కమల్‌ ఆర్థిక ఇబ్బందులకు గౌతమి కూడా ఒక కారణం అయ్యి ఉంటుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏదైతేనేం యూనివర్శిల్‌ స్టార్‌ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.

SHARE