వణికిపోతున్న కోలీవుడ్ ..కమల్ కి కష్టాలు తప్పవా?

0
276
kamal hassan scared because of Palaniswamy cm of tamil nadu

Posted [relativedate]

kamal hassan scared because of Palaniswamy cm of tamil nadu
శశికళ,పన్నీర్ సెల్వం మధ్య సీఎం కుర్చీ కోసం యుద్ధం జరుగుతున్నప్పుడు సామాన్యులు ఏమి జరుగుతుందో అని గమనిస్తూ వచ్చారు.ఎవరికిఎవరు ఇష్టమైనా శశి,పన్నీర్ కోసం రోడ్లెక్కి పోరాటం చేసేంత అభిమానం వారి మీద ప్రజల్లో లేదని తేటతెల్లమైంది.అయితే పన్నీర్ నోరు తెరిచి శశి మీద విమర్శలు ఎక్కుపెట్టగానే భారీగా స్పందించింది మాత్రం కోలీవుడ్.కమల్,గౌతమి,ఆర్య మొదలుకొని ఎంతో మంది నటీనటులు పన్నీర్ కి అండగా శశికి వ్యతిరేకంగా గొంతు చించుకున్నారు..అదేలేండి వేళ్ళకి పనిచెప్పి సోషల్ మీడియాలో తమ ఘోష చెప్పుకున్నారు.కమల్ హాసన్ అయితే ఇంకో అడుగు ముందుకేసి ఇన్ డైరెక్ట్ కామెంట్స్ తో శశి మీద రెచ్చిపోయారు.ఇక సుదీర్ఘ కాలం ఆయనతో సహజీవనం చేసిన గౌతమి గురించి అయితే చెప్పక్కర్లేదు.ఆమె ఓ విధంగా యాంటీ శశి ప్రచారకర్త పాత్ర పోషించారు.వీరితో పాటు అప్పుడు ట్వీట్ లు వేసినవాళ్లంతా ఇప్పుడు వణికిపోతున్నారు.

కోలీవుడ్ ప్రముఖులు అలా వణికిపోడానికి కారణం లేకపోలేదు.ఒకప్పుడు జయ కి వ్యతిరేకంగా ఇలాగే మాట్లాడి కమల్,విజయ్ లాంటి అగ్రశ్రేణి హీరోలే తమ సినిమా విడుదల చేసుకోడానికి ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలుసు.విశ్వరూపం టైం లో కమల్,తలైవా విడుదల సమయంలో విజయ్ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో కోలీవుడ్ ఇంకా మర్చిపోలేదు.పైగా అప్పుడు సినిమా ఫీల్డ్ అంటే ఎంతోకొంత అభిమానం వున్న జయలలిత.ఇప్పుడు సీన్ లో వున్నది శశికళ.పైగా తన వ్యతిరేకులకు చుక్కలు చూపిస్తానని జయ సమాధి సాక్షిగా శపధం కూడా చేసి వుంది.ఈ విషయాలే ఇప్పుడు ఆరోజు నోరు పారేసుకున్న కోలీవుడ్ ప్రముఖుల్ని గజగజలాడిస్తోంది.శశికళ వారికి ఎలాంటి సినిమా చూపిస్తుందో ఏమో పాపం.

Leave a Reply