కన్నా చక్రం తిరిగిందా?

Posted October 13, 2016

 kanna lakshmi narayana angry ap tdp
కాంగ్రెస్ నుంచి బీజేపీ గూటికి చేరిన దగ్గరనుంచి సైకిల్,కమలం మధ్య అగ్గిరాజేయడానికి సీనియర్ నేత కన్నా గట్టి ప్రయత్నాలే చేసినట్టు అయన అనుచరులే చెబుతుంటారు.ఓ దశలో అవి సక్సెస్ అవుతాయనిపించింది.బీజేపీ హైకమాండ్ కూడా ఓ టైం లో కన్నా వెన్ను తట్టింది.అయన కూడా వ్రతం చెడ్డా ఫలితం దక్కిందిలే అనుకున్నారు.కానీ హోదా డిమాండ్ ముందుకు రావడంతో బాబుని ప్యాకేజ్ కి ఒప్పించడానికి బీజేపీ వ్యూహం మార్చుకుంది.బాబుతో కలిసి ఎన్నికలకి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాక ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సొంత పార్టీ నేతల్ని కట్టడి చేసింది.

అదే సమయంలో విరక్తి చెందిన కన్నా వైసీపీ వైపు చూస్తున్నారన్న వాదనలు వినిపించాయి .కొన్ని ప్రయత్నాలు జరిగాయి.లోపలేమైందో బయటికి పొక్కేలోపే గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల అంశం ముందుకొచ్చింది.ఇదే అదనుగా మిర్చి యార్డ్ సహా వివిధ పదవుల పంపకంలో టీడీపీ మిత్రధర్మం పాటించలేదని బీజేపీ శ్రేణుల్ని కన్నా రెచ్చగొట్టగలిగారు.వారంతా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబుని కలిసి తమ వాదన వినిపించారు.దీంతో అయన కూడా బలముంటే విడిపోటీకి సిద్ధపడొచ్చన్న సంకేతాలు ఇచ్చారు.అంత బలం తమకి లేదని ఆది నుంచి పార్టీలోవున్న నేతలు చెప్తున్నా కన్నా అనుచరులు ససేమిరా అంటున్నారు.దీంతో గుంటూరు లోసైకిల్,కమలం పోటీ తప్పదనిపిస్తోంది.కానీ ఈ పరిణామాలపై టీడీపీలోని ఓ వర్గం డౌట్ పడుతోంది.మిత్రబేధం ద్వారా వైసీపీ కి లబ్ది చేకూర్చి ఆపై ఆ పార్టీలోకి జంప్ కావడానికే కన్నా నాటకమాడుతున్నారని వాళ్ళ అనుమానం.బీజేపీ పెద్దలకి కూడా ఇదే విషయం చెప్పారట.ఈ పరిస్థితుల్లో కన్నా చక్రం తిరుగుతుందో …ఊడుతుందో చూడాలి

SHARE