వైసీపీ లోకి కన్నా?అమిత్ షా దెబ్బ ?

  kanna lakshminarayana join ysrcp party
కన్నాలక్ష్మీనారాయణ బీజేపీ నుంచి వైసీపీ లోకి చేరే ఆలోచనలో ఉన్నారా ?ఔననే తెలుస్తోంది. విభజన రాజకీయాలతో దెబ్బ తిన్న అప్పటి కాంగ్రెస్ ముఖ్యనేతల్లో కన్నా లక్ష్మీనారాయణ ఒకరు.ఆ షాక్ నుంచి తేరుకున్న అయన వెంటనే కమలం తలుపు తట్టారు.పార్టీలో చేరేదాకా …చేరిన కొన్నాళ్ల దాకా పరిస్థితి బాగానే వుంది.ఓ దశలో కన్నా మాటకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రాధాన్యం ఇచ్చారు.బీజేపీ సొంతంగా ఎదగాలని భావించినంత కాలం కమలనాధులు కన్నా భుజం తట్టారు.బాబు హోదా కోసం మాట్లాడినప్పుడు కన్నా ఆయనకు వ్యతిరేకంగా బీజేపీ హైకమాండ్ కొమ్ము కాశారు.బీజేపీ కి పవన్ ని దగ్గరచేసి బాబుని దూరం పెట్టాలని కన్నా ప్రయత్నించారు.కొంతవరకు సఫలమయ్యారు కూడా.

హోదా డిమాండ్ ఉద్ధృతమై దాన్ని ప్యాకేజ్ తో చల్లార్చడానికి కేంద్రం ఎప్పుడు డిసైడ్ అయ్యిందో అప్పుడే కన్నా సీన్ కి రివర్స్ గేరు పడింది.ఇంటలిజెన్స్ నివేదికలతో బీజేపీ హైకమాండ్ ..చంద్రబాబుని వదులుకోకూడదని డిసైడ్ అయ్యింది. ప్యాకేజ్ ప్రకటన దగ్గరనుంచి రూట్ మార్చింది.అంతకుముందు కన్నా వంటివాళ్ళ వెన్ను తట్టిన అమిత్ షా ఇటీవల ఇక బాబుకి వ్యతిరేకంగా మాట్లాడ్డం తగదని కుండబద్దలు కొట్టారు.బాబుపై మొదటినుంచి సదభిప్రాయం లేని కన్నా దీంతో పునరాలోచనలో పడ్డారు.ఇదే అదనుగా వైసీపీ ముఖ్యులు రంగంలోకి దిగి కన్నాని పార్టీలోకి ఆహ్వానించారంట.అయన వస్తే జిల్లాలో కీలక బాధ్యతలు అప్పజెప్పడం తో పాటు Mlc అవకాశం కల్పిస్తామని జగన్ తరుపున హామీ వచ్చిందట.ఈ పరిస్థితుల్లో ఏ ప్రాధాన్యం లేని బీజేపీ లో కొనసాగడం కన్నా వైసీపీ మేలని లక్ష్మీనారాయణ భావిస్తున్నారట.అంతా అనుకున్నట్టు అయితే దసరా టైం లో అయన ఫ్యాన్ కిందకి చేరొచ్చు.

SHARE