షూటింగ్ లో అపశృతి ఇద్దరు ప్రాణాలు బలి..!

Kannada Actors Died During Climax Shoot

కన్నడ సినిమా షూటింగ్లో అపశృతి దొర్లింది. ప్రముఖ కన్నడ హీరో దునియ విజయ్ నటిస్తున్న సినిమా మాస్తిగుడి. క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా బెంగుళూరు నుండి 35 కిలోమీటర్ల దూరంలో తిప్పగొందనహళ్లి రిజర్వాయర్ లో ఈరోజు షూటింగ్ జరుపుకుంటున్నారు. హెలికాప్టర్ నుండి హీరోతో పాటు ఇద్దరు నటులు అనీల్, ఉదయ్ చెరువులో దూకి ఆ తర్వాత ఒడ్డుకి చేరుకోవాలి. అయితే ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉండటంతో హీరో విజయ్ ఒక్కడే అతి కష్టం మీద ఒడ్డుకి చేరుకోగలిగాడు.

అనీల్, ఉదయ్ ఇద్దరు నటులు ఒడ్డుకి చేరలేదు. కనీసం వారి బాడీలు కూడా కనబడని పరిస్థితి ఎదురైందట. ఈ సినిమా షూటింగ్ కు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని పోలీస్ వారు చిత్రయూనిట్ మీద కేసు నమోదు చేశారట.

SHARE