గురువుకు దగ్గులు నేర్పుతున్న శిష్యుడు

0
511
kapil mishra comments on kejriwal

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

kapil mishra comments on kejriwalసామాన్యుడి పార్టీగా ఢిల్లీ పీఠమెక్కిన ఆమ్ ఆద్మీ.. ఇప్పుడు కిందా మీదా పడుతోంది. ఏ అవినీతి అస్త్రం ప్రయోగించి కాంగ్రెస్ ను గద్దె దించిందో.. ఇప్పుడు అదే అస్త్రం కేజ్రీవాల్ కు శాపంగా మారింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఓటమి తర్వాత.. పార్టీతో పాటు ప్రభుత్వాన్ని కూడా ప్రక్షాళన చేయాలని కేజ్రీవాల్ డిసైడయ్యారు. కానీ ఆ పని పూర్తిగా చేయకుండానే.. అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఏకంగా కేజ్రీవాలే లంచం తీసుకున్నారంటూ మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించడంతో.. ఆప్ సంకటంలో పడింది.

ప్రెస్ మీట్ తో ఆగని కపిల్ మిశ్రా, ఏసీబీ, సీబీఐ, లెప్ఠినెంట్ గవర్నర్ కు ఆధారాలు కూడా ఇచ్చి వచ్చారు. దీంతో కేజ్రీవాల్ గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లైంది. పైకి కపిల్ మిశ్రాపై ఆరోపణలు చేస్తున్నా.. లోలోపల మాత్రం ఏ ఆధారం ఎటు దారితీస్తుందో అనే ఆందోళన ఆప్ నేతల్లో కనిపిస్తోంది. అసమ్మతి నేతల్ని సంతృప్తి పరిచి.. మళ్లీ తిరుగులేని ఆధిపత్యం చెలాయించాలనుకున్న కేజ్రీవాల్ కు సీన్ రివర్సైంది. కేజ్రీపై కంప్లైంట్లు ఇచ్చిన కపిల్ మిశ్రా అవినీతిపై పోరాటంలో ఆశీస్సులు కావాలని కేజ్రీవాల్ నే అడగడం.. మొత్తం మ్యాటర్ కే పెద్ద ట్విస్ట్.

కపిల్ మిశ్రా వెనుక బీజేపీ ఉందని ఇప్పటిదాకా ఆరోపణలు చేసిన ఆప్ నేతలు.. కపిల్ సునామీని ఎలా ఆపాలో తెలియక తల పట్టుకుంటున్నారు. మొన్నటివరకూ మోడీపై ఎగిరిపడ్డ కేజ్రీవాల్.. కపిల్ అస్త్రాన్ని కాచుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారు. ఏసీబీ ఏదో ఒక ఆధారం పట్టుకుని కేసు కోర్టులో వేస్తే.. అది తేలేసరికి పుణ్యకాలం గడిచిపోతుందని, కానీ ఆలోగా కేజ్రీవాల్ అవినీతిపరుడని ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తే సమాధానం చెప్పడం ఎలాగని ఆప్ నేతలు సతమతమౌతున్నారు.

Leave a Reply