ముద్రగడకి కౌంటర్..జగన్ ప్లాన్ తో పులివెందుల స్కెచ్

 Posted October 17, 2016

kapu corporation chairman ch ramanjaneyulu counter mudragada pada yatra
వైసీపీ అండతోనే ముద్రగడ పాదయాత్ర తలపెట్టారని భావిస్తున్న టీడీపీ భలే కౌంటర్ ప్లాన్ రెడీ చేసింది.ఈసారి జగన్ వ్యూహాన్నే అమలు చేయబోతోంది.తనపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడల్లా దాన్ని ఖండించకుండా బాబు కూడా అవినీతి పరుడే అని జగన్ చెప్తుంటారు.ఇద్దరం ఓ గూటి పక్షులమని చెప్పడానికి ట్రై చేస్తారు.ఇప్పుడు కాపు రిజర్వేషన్ వ్యవహారంలో అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది తెలుగుదేశం.

ముద్రగడని దీటుగా ఎదుర్కొంటున్న కాపు కార్పొరేషన్ చైర్మన్ ch .రామాంజనేయులు ని దేశం రంగంలోకి దించింది.వైస్ హయాంలో కాపు రిజర్వేషన్ లకి ఇచ్చిన హామీ నిలబెట్టుకోని విషయాన్ని ప్రజలకి చెప్పడానికి ఆయనతో పులివెందుల నుంచి పాదయాత్ర చేయించాలనుకుంటోంది.రామాంజనేయులు దీనిపై ప్రకటన కూడా చేసేసారు.ముద్రగడ ys హయాంలో మౌనం వహించి ఇప్పుడు జగన్ రాజకీయ క్రీడలో పావుగా మారారని ప్రజలకి చెప్పడమే లక్ష్యంగా కౌంటర్ పాదయాత్ర కి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.జగన్ ప్లాన్ తో,జగన్ సొంతగడ్డ నుంచి తలపెట్టిన పాదయాత్ర ప్రకటనతో వైసీపీ షాక్ అయ్యింది.ఔను మరి రాజకీయ చదరంగంలో ప్రత్యర్థి పావులు కదపకుండా ఉంటాడా?

SHARE