పాదయాత్రా?సత్యాగ్రహమా?తేల్చుకోలేకపోతున్న నేత..

Posted October 5, 2016

 kapu leader mudragada thinking  walking kapu reservation purpose
కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్న ముద్రగడ పద్మనాభం పోరాట పంధా విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇకపై ధర్నాలు,ఆందోళనలు చేసే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్ లో దాసరి ఆధ్వర్యంలో ఓ హోటల్ లో జరిగిన సమావేశంలోనూ ఇదే అంశం గురించి కూడా చర్చ వచ్చిందట.ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లేందుకు  చివరి దశలోముద్రగడతో పాదయాత్ర లేదా సత్యాగ్రహం చేయించాలని ..దాని గురించి త్వరలో ప్రకటన చేయాలని నిశ్చయించారు.

ఉద్యమ పథాన్ని ప్రకటించే ముందు గ్రామ,మండల,నియోజకవర్గ,జిల్లా స్థాయుల్లో కాపు ఐకాసా ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.ఇక పై 15 రోజులకోసారి అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేపట్టాలని ..ఏదో ఓ చోట ముద్రగడ పాల్గొనేలా చూసుకోవాలని హైదరాబాద్ లో జరిగిన తాజా సమావేశంలో ఓ అభిప్రాయానికి వచ్చారు.

SHARE