జక్కన్న ఇకపై ఇండియాస్‌ సూపర్‌స్టార్‌

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

karan johar calls to rajamouli as super star
అపజయమెరుగని టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తాజాగా ‘బాహుబలి 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాలీవుడ్‌ సినిమాల రికార్డులను కేవలం వారం రోజుల్లో బ్రేక్‌ చేసి సరి కొత్త రికార్డుల దిశగా దూసుకు పోతుంది. ఇండియన్‌ సినీ ప్రేక్షకులు చాలా రోజులుగా వెయ్యి కోట్ల కలెక్షన్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ కోరికను ‘బాహుబలి 2’ తీర్చడం ఖాయంగా కనిపిస్తుంది. మొదటి పార్ట్‌ దాదాపు 650 కోట్ల వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. ఒక్క సినిమాతో దేశంలోనే నెం.1 దర్శకుడిగా హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ దృష్టిని ఆకర్షించిన రాజమౌళికి బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ కొత్త బిరుదును ఇచ్చాడు.

సూపర్‌ స్టార్‌ అని నటులను మాత్రమే అంటారు. కాని రాజమౌళికి సూపర్‌ స్టార్‌ అంటూ నిర్మాత కరణ్‌ జోహార్‌ కొత్త బిరుదును ఇచ్చాడు. రాజమౌళి స్థాయికి సూపర్‌ స్టార్‌ అనేది కూడా సరి పోదని ఆయన అభిమానులు అంటున్నారు. తెలుగు సినిమాను బాలీవుడ్‌ ప్రముఖులు చిన్న చూపు చూసేవారు. కాని ‘బాహుబలి’తో తెలుగు సినిమా ఖ్యాతి అమాంతం పెరిగింది. బాలీవుడ్‌లో ఈ సినిమా చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. బాలీవుడ్‌ సినిమాల స్థాయిని క్రాస్‌ చేసి ‘బాహుబలి 2’ వసూళ్లు సాధిస్తున్న నేపథ్యంలో జక్కన్నను సూపర్‌ స్టార్‌ అనడంలో ఏమాత్రం తప్పులేదని సినీ వర్గాల వారు అంటున్నారు.

Leave a Reply