బాహుబలి వల్ల కరణ్‌ జోహార్‌కు ఎంత లాభమో తెలుసా?

0
615
karan johar get more profits from bahubali 2 movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

karan johar get more profits from bahubali 2 movie
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ సినిమా విడుదలై రెండు వారాలు దాటినా కూడా కలెక్షన్స్‌ ప్రభంజనం మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి 2 రికార్డుల మోత మ్రోగించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు విడుదలైన అన్ని ఏరియాల్లో కూడా సరి కొత్త రికార్డుల దిశగా దూసుకు పోతుంది. బాలీవుడ్‌లో కనీవిని ఎరుగని రీతిలో ఇప్పటి వరకు 375 కోట్ల వసూళ్లను సాధించినట్లుగా అధికారిక సమాచారం అందుతుంది. బాలీవుడ్‌ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను హిందీలో డబ్‌ చేసిన విషయం తెల్సిదే. ఆయనకు కాసుల పంట పండుతుంది.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘బాహుబలి 2’ కోసం కరణ్‌ జోహార్‌ డబ్బింగ్‌ రైట్స్‌ మరియు ప్రమోషన్స్‌ కలిపి 100 కోట్ల వరకు ఖర్చు చేశాడు. సినిమా కలెక్షన్స్‌ సునామి సృష్టిస్తున్న నేపథ్యంలో కరణ్‌ జోహార్‌కు భారీ లాభాలు వస్తున్నాయి. ఈ సినిమా కలెక్షన్స్‌లలో నిర్మాతల షేర్‌ పోను ఇప్పటి వరకు దాదాపు 200 కోట్ల వరకు కరణ్‌ జోహార్‌ ఖాతాలో పడ్డట్లుగా తెలుస్తోంది. ఒక సౌత్‌ సినిమా బాలీవుడ్‌లో ఈ రేంజ్‌లో వసూళ్లు సాధిస్తుందని ఏ ఒక్కరు ఊహించి ఉండరు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాలు సైతం సాధించలేని కలెక్షన్స్‌ను ‘బాహుబలి 2’ సాధించి కరణ్‌ జోహార్‌కు పంట పడిస్తున్నట్లుగా ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.

Leave a Reply