కరణ్ కాళ్ళ బేరానికొచ్చాడు..

 Posted October 19, 2016

karan johar say sorry to indian people

బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ తగ్గాడు. పాకిస్తాన్ నటులకు అనుకూలంగా మాట్లాడటంతో.. తీవ్ర విమర్శణలని ఎదుర్కొన్నాడు కరణ్. ఆ తర్వాత క్షమాపణలు చెప్పేందుకు కూడా ముందుకు రాలేదు. అయితే, అతగాడి తాజా సినిమా ‘యే దిల్‌ హై ముష్కిల్‌’లో పాకిస్థానీ నటుడు ఫవాద్‌ ఖాన్‌ వుండటం, దీనికి నిరసనగా ఈ సినిమా పలు థియేటర్లు బ్యాన్ చేయడంతో కరణ్ కాళ్ళ బేరానికొచ్చాడు.

ప్రజలు తనను భారత వ్యతిరేకిగా భావించడం తనను చాలా బాధిస్తున్నదని పేర్కొన్నాడు. తనకు అన్నిటి కంటే దేశమే ముఖ్యమని స్పష్టం చేసిన కరణ్..ఇకపై పాక్‌ నటులను తన సినిమాలో తీసుకొనని తెలిపాడు. ఈ మేరకు ఓ వీడియోని రిలీజ్ చేశాడు కరణ్. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

మరోవైపు, 450 మంది సినిమా థియేటర్ల యజమానుల సంఘం  ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ చిత్రాన్ని ప్రదర్శించేది లేదని తేల్చి చెప్పింది. ఎంఎన్ఎస్ నేతలు ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ చిత్రం రన్ అయ్యే థియేటర్స్ ని పేల్చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

SHARE