బాహుబలి సెల్ఫీ అదిరింది..

Posted March 28, 2017

ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు రెండు సంవత్సరాల నుండి కష్టపడి రూపొందించిన బాహుబలి సినిమా ఎట్టకేలకు కంప్లీట్ అయ్యింది. వచ్చేనెల సినిమా రిలీజ్ అవనున్న సందర్భంగా మొన్న ఆదివారం సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు యూనిట్ సభ్యులు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో అతిరధమహారధుల సమక్షంలో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. వేడుక ముగిసిన తర్వాత బాహుబలి టీం మొత్తం కలిసి ఓ సెల్ఫీ దిగింది. రానా దగ్గుబాటి, ప్రభాస్, అనుష్క శెట్టి, తమన్నా, రమ్య కృష్ణ, సత్యరాజ్, నాజర్, డైరెక్టర్ రాజమౌళి, సెంథిల్ కుమార్, శోభు యార్లగడ్డ, ప్రసాద్, కరణ్ జోహర్, సుబ్బరాజు, కీరవాణి  తదితరులు ఉన్నారు. ఈ సెల్ఫీని కరణ్ జోహార్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ బాహుబలి సెల్ఫీ అంటూ ఈ ఫొటో తెగ షేర్ అయిపోతోంది.

SHARE