కాంగ్రెస్ లో కర్నాటక కాక.

అసలే వరస రాజకీయలతో కునారిల్లు తున్న కాంగ్రెస్ కు మూలిగే నక్కపై తాటి పండు లా మరో కష్టం వచ్చిపడింది..దక్షినాదిలో  కాస్త బలంగా కనిపిస్తున్న కర్నాటక రాష్ట్రంలో హస్తం పార్టీకి ఈ పరిస్థితి ఎదురైంది.పనితీరు అవినీతి ఆరోపణల విషయంలో విమర్శలు ఎదుర్కుంటున్న కర్ణాటక సి ఎం సిద్ధరామయ్య క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణకు పూనుకొని తేనెతుట్టె రేపారు.14 మందికి క్యాబిట్ నుంచి ఉద్వాసన పలికి 13 మందికి  కొత్తగా చోటిచ్చారు.పదవి పోయిన వాళ్ళంతా దాదాపుగా తిరుగుబాటు జెండా ఎత్తారు…అసమ్మతి రాజకీయాలకు తెరలేపారు.

karnataka heat congress

రెబల్ స్టార్ అంబరీష్ ఏకంగా MLA పదవికి  కూడా రాజీనామా చేశారు.సిద్ధరామయ్య బుజ్జగించినా ఫలితం లేక పోయింది.అవకాశం కోసం కాచుకుకుర్చున్న విపక్షాలు అసంతృప్తి నేతలకు గాలం వేసే పనిలో పడ్డాయి.బెంగుళూరులో రాజకీయ కాక డిల్లీ 10 జన్ పధ్ ను తాకింది.సిద్ధరామయ్య ను ఏమన్నా అందామంటే తామే క్యాబినెట్ లో మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం కదా అని సోనియా,రాహుల్ నాలిక కరుచుకొంటున్నారు.రెండేళ్ళ తర్వాత వచ్చే ఎన్నికల మాటేమో గానీ ఇప్పటికిప్పుడు పరిస్థితిని చక్కదిద్దే ట్రబుల్ షూటర్ లపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పడింది.

Leave a Reply