‘ఊపిరి’ తో తెలుగులోనూ తనదైన మార్క్ వేసుకున్న కార్తీ కడుపు మాడుతోంది.దిగ్గజ దర్శకుడు మణిరత్నందే ఈ పాపం ….ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఈ నెల్లో నే ఓ సినిమా షూటింగ్ మొదలవుతోంది.
కార్తీ -మణి కాంబినేషన్ లో వచ్చే సినిమా లో హీరో ఓ పైలట్… అతను ఓ డాక్టర్ తో ప్రేమలో పడటం ఈ చిత్ర కథలో కీలకం ..పైలెట్ అంటే ఎలా ఉండాలి …స్లిమ్ గా …ట్రిమ్ గా ఉండాలి కదా! అందుకే 10 కేజీలు బరువు తగ్గమని కార్తీకి మణి షరతుపెట్టాడట అంతటి దర్శకుడు అడిగియితే ఏ హీరో కాదంటారు?వెంటనే కడుపు మాడ్చుకొని పదికేజిలు తగ్గే పనిలో పడ్డాడు కార్తీ ..చెన్నై లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకునే ఈ సినిమా షూటింగ్ తరువాత కాశ్మిర్ లో జరుగుతుంది…ఏ.ఆర్.రెహ్మాన్,రవి వర్మన్ వంటి దిగ్గజాలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు..ఇంతమంది గొప్పవాళ్ళ మధ్య పనిచేసే అవకాశం కోసం కార్తీ ఆ మాత్రం కడుపు మాడ్చుకుంటే తప్పేముందేలే?