ఆర్థిక నేరగాళ్లు కేరాఫ్ లండన్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

karthi chidambaram went to london after it ridesమొన్న విజయ్ మాల్యా. ఇప్పుడు కార్తీ చిదంబరం. ఇండియాలో స్కాములు చేయడం. బ్రిటన్లలో దాక్కోవడం. చివరకు లండన్ కోర్టుల నుంచి అనుమతి పొంది నేరగాళ్లను రప్పించడానికి మన ప్రభుత్వాలు ఆపసోపాలు పడటం . ఇదీ దశాబ్దాలుగా నడుస్తున్న సీన్. కానీ మాల్యా ఎపిసోడ్ తర్వాత కూడా సీబీఐ, ఐటీ రైడ్స్ తర్వాత కార్తీ చిదంబరం లండన్ ఎలా వెళ్లగలిగారనేది బహిరంగ రహస్యమే. సీబీఐ రైడ్స్ పాలిటిక్స్ కోసమే కానీ.. నిజంగా చిత్తశుద్ధితో జరిగేవి కాదని తేలిపోయింది.

మిగిలిన ప్రధానులు ఓ ఎత్తు. ఇప్పుడున్న పీఎం మోడీ మరో ఎత్తు అనుకుని సామాన్యులు ఆయనకు బంపర్ మెజార్టీ ఇచ్చి 2014 ఎన్నికల్లో గెలిపించారు. ఇంత చేసినా మోడీ మాత్రం కాంగ్రెస్ ను మించి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మేధావులు భావిస్తున్నారు. అయితే తాము నిజంగా అవినీతిపరుల భరతమే పడుతున్నామని చెప్పుకుంటున్న ఎన్డీఏ సర్కారు ఆచరణలో మాత్రం అంత స్ట్రిక్టుగా ఉండటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మాల్యా విషయంలో కూడా అష్టదిగ్భంధనం జరుగుతున్న సమయంలోనే.. ఆయన బ్రిటన్ పారిపోవడం, కేంద్రం వైఫల్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కార్తీ చిదంబరంపై ఆస్తులు జప్తుచేసే స్థాయిలో కేసులు రిజిస్టరైనా.. దాడులు జరిగి 24 గంటలు గడవక ముందే.. కార్తీ లండన్ ఫ్లైటెక్కాడంటే.. కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇకపై దేశంలో ఆర్థిక నేరగాళ్లంతా లండన్లో తలదాచుకుంటారేమోనని, కేంద్రమే దగ్గరుండి విమానాలు ఎక్కిస్తుందని సెటైర్లు పడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here