కాష్మోరా.. కబాలి రిజల్ట్ తప్పదా.. ?

 Posted October 27, 2016

karthi kashmora movie expectations as like kabali movieకార్తీ ‘కాష్మోరా’ ప్రమోషన్స్ పీక్స్ చేరింది.ఫస్ట్ లుక్,టీజర్ తో ‘కాష్మోరా’ అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయ్.ఎంతగా అంటే..’బాహుబలి’తో కాష్మోరా ని కంపేర్ చేస్తున్నారు.కొందరైతే..’బాహుబలి’ మించిన సినిమాగా నిలుస్తుందని ఊదరగొడుతున్నారు. ‘కాష్మోరా’ కార్తీ త్రిపాత్రాభినయం చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో సైనికాధికారి పాత్ర ఒకటి.కాష్మోరా లో ఓ అరగంట పాటు యుద్ద సన్నివేశాలు ఉండనున్నాయి.అవే ఇప్పుడు టీజర్ లో అదరగొడుతున్నారు దీంతో..కాష్మోరా పై క్రేజ్ పీక్స్ కి చేరిపోయింది.

అయితే,ఇదంతా పబ్లిసిటీ హంగామా మాత్రమే.కాష్మోరా రొటీన్ హర్రర్ కామెడీ చిత్రం అనే ప్రచారం కూడా సాగుతోంది.సినిమాలో ఓ అరగంట పాటు యుద్ద నేపథ్యంలో సాగే సీన్స్ ని చూసి బాహుబలి తో పోల్చుతున్నారు.అంతేతప్ప..కాష్మోరాలో కొత్తదనం ఏమీలేదట.రిలీజ్ కి ముందు సూపర్ స్టార్ ‘కబాలి’క్రేజ్ కూడా పీక్స్ కి చేరింది. రిలీజ్ తర్వాత తెలిసింది ‘కబాలి’ ఖాళీ అన్నవిషయం.ఇప్పుడు కాష్మోరా కూడా అంతే అంటున్నారు. భారీ అంచానాల మధ్య రిలీజ్ కాబోతున్న కాష్మోరాకి నిరాశ తప్పదని చెబుతున్నారు.మరి..ఇదెంత వరకు నిజమన్నది తెలియాలంటే ఈ శుక్రవారం వరకు ఆగాల్సింది.కాష్మోరా అక్టోబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

SHARE