ఫస్ట్ టాక్ : కాష్మోరా

 Posted October 28, 2016

karthi kashmora movie first talk‘బాహుబలి’రిలీజ్ కి ముందు నెలకొన్న ఉత్కంఠ ఏరేంజ్ లో ఉందో ప్రేక్షకులకి తెలుసు.ఇప్పుడు కార్తీ ‘కాష్మోరా’విషయంలోనూ దాదాపు అదే ఉత్కంఠ నెలకొంది ..భారీ అంచనాల మధ్య ‘కాష్మోరా’ దీపావఌకి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే థీయేటర్లలో ఫస్ట్ షో పడిపోయింది. మరి.. ప్రేక్షకుల నుంచి వస్తోన్న ఫస్ట్ టాక్ ఎలా ఉంది.. ? ఓసారి చూద్దాం పదండీ..

దాదాపు 500యేళ్ల క్రితం నాటి ఫ్లాష్ బ్యాక్ తో కాష్మోరా ఇంట్రస్టింగ్ గా ప్రారంభమైందట.అరుంధతి తరహాలో ఓ శాపంతో ఓ ఆత్మ బంధీ అయిపోతుంది.ప్లాష్బ్యాక్ సీన్ లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇక, ప్రజెంట్ జెనరేషన్ లో జనాలకు ఉన్న దెయ్యాలు, మంత్రాల వాటిపై ఉన్న నమ్మకాలపై ఆడుకుంటూ డబ్బు సంపాదిస్తూంటాడు కార్తి. దెయ్యాలను పట్టుకుంటూంటాడు. అతని పేరే కాశ్మోరా. దెయ్యాలను పట్టుకునేవాడిగా మంచి పాపులారిటీ వస్తుంది.శ్రీదివ్య (యామిని) దెయ్యాలపై రీసెర్చ్ చేస్తూంటుంది. అందుకే దెయ్యాలతో ఎప్పుడూ టచ్ లో ఉండే కాశ్మరా తో టచ్ లో ఉంటుంది.కాష్మోరా అసలు స్వరూపం బయటపెట్టి..అతను ఫ్రాడ్ అని నిరూపించి అరెస్ట్ చేయించాలన్నది యామిని ట్రై చేస్తుంది.

దెయ్యాలని పట్టుకొనే స్పెషలిస్టు కాష్మోరా కి విలన్ ఇంట్లో నుంచి దెయ్యాలని తరిమివేయాలనే ఆఫర్ వస్తోంది. ఆ ఆఫర్ తో విలన్ ఇంట్లో అడుగుపెట్టిన కార్తీకి..ఆ ఇంట్లో ఉన్న 500యేళ్ల నాటి ఆత్మ ప్రవేశింస్తుంది. ఐదేళ్ల నాటి కార్తీకి, ఇప్పటికి కార్తీకి సంబంధం ఏమిటి.. ? కథలో ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే రత్నమహాదేవి ఎవరు అన్నది మిగితా స్టోరీ.

మొత్తంగా చూస్తే.. కాష్మోరా కెవ్వుకేక అంటున్నారు ప్రేక్షకులు. ఓ వైపు నవ్విస్తూనే..ప్రేక్షకుడు కథలో లీనం అయిపోతాడట. ఫస్ట్ టాక్ సూపర్ హిట్. మరి.. కొద్ది నిమిషాల్లో పూర్తి రివ్యూ మీ ముందు వుంచుతుంది.. మీ తెలుగు బుల్లెట్ డాట్ కామ్.

SHARE