ఆ సినిమాలో కార్తి 47 గెటప్పులట

0
603
karthi movie kashmora 47 getups

karthi movie kashmora 47 getups

విలక్షణ నటుడు సూర్య తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన కార్తి అటు కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్లో కూడా అన్నలానే మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు. మన పక్కింటి కుర్రాడిగా కార్తి చేసే ప్రతి పాత్ర తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుంది. ఎప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నాలు చేసే కార్తి ప్రస్తుతం చేస్తున్న కాష్మోరాతో నిజంగానే కొత్త కొత్త గెటప్పులేస్తున్నాడు. గోకుల్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా నుండి రీసెంట్ గా వదిలిన ఫస్ట్ లుక్ వారెవా అనేలా ఉంది. ఇక ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న కార్తి ఈ మూడింటి కోసం ఏకంగా 47 గెటప్పుల్లో కనిపిస్తాడట.

బాహుబలి రేంజులో కోలీవుడ్ నుండి వస్తున్న సినిమాగా ప్రచారం జరుగుతున్న కాష్మోరా సినిమా కార్తి కెరియర్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబడుతుంది. ఇక ఈ గెటప్పుల కోసమే దాదాపు 7 నెలలు షూటింగ్ జరిపారట. ఇక సైనికాధికారిగా, నేటితరం యువకుడిగా, గూఢాచారిగా మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. అంతేకాదు కార్తి గెటప్పులే కాకుండా ఇంకా సినిమాలో చాలామంది డిఫరెంట్ గెటప్పులతో అలరిస్తాడట. మరి కోలీవుడ్ నుండి అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ కాష్మోరా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా దీపావళికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.

Leave a Reply