పిక్ టాక్ : రత్న మహాదేవి.. జేజమ్మని మించిపోయింది

Posted October 6, 2016

  karthi nayanatara kashmora movie look super

కార్తీ ‘కాశ్మోరా’.. ఫస్ట్ లుక్‌లోనే సినిమాపై అంచనాలు పెంచేసింది. గోకుల్‌ దర్శకత్వం తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కార్తి త్రిపాత్రాభినయం చేయనున్నాడు. నయన తార రాణిగా కనిపించనుంది. మరో హీరోయిన్‌గా శ్రీదివ్య నటిస్తుంది. తాజాగా, కాశ్మోరా నుంచి రెండు లుక్స్ లు రిలీవ్ అయ్యాయి. ఇందులో ఒకటి కార్తీది కాగా, రెండోది నయనతారది. నయన్ ని ‘రత్న మహాదేవి’గా పరిచయం చేశారు.

ఫస్ట్ లుక్ తో పోలిస్తే.. ఇప్పటి కార్తీ లుక్ సాధాసీదాగా ఉండగా.. నయన్ లుక్ అదిరిపోయింది. రాణి లుక్కులో జేజేమ్మ అనుష్కనే మించిపోయింది. రాణి రత్న మహాదేవిగా ఠీవిగా కనిపిస్తోంది. తాజా లుక్కులతో కాశ్మోరోపై మరిన్ని అంచనాలు పెరిగడం ఖాయం. భారీ అంచనాల మధ్య కార్తీ కాశ్మోరా దీపావఌకి ప్రేక్షకుల ముందుకు రానుంది.

SHARE