ఇదీ సిసలైన రికార్డు

0
694
Karunanidhi -has -set- a -record -that- does- not- remove- it

 

బాహుబలి రెండు వేల కోట్ల గురించి దేశమంతా మాట్లాడుకుంది. ఓ విజువల్ వండర్ సృష్టించిన అద్భుతమది. కానీ ఇప్పుడు కరుణానిధి అందుకు ఏమాత్రం తీసిపోని రికార్డు నెలకొల్పారు. దేశంలోనే కురువృద్ధుడైన రాజకీయ నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 95వ ఏట అడుగుపెట్టిన కరుణ.. సమకాలీన నాయకులందరిలోకి పెద్దవారుగా నిలిచారు. కేంద్రమంత్రులు, ప్రధానులు, గవర్నర్లు, సీఎంలు ఇలా ఎవర్ని చూసినా.. అందరూ ఆయనకంటే చిన్నవారే. ఎప్పుడో యాభైల్లో రాజకీయాలు మొదలుపెట్టిన కరుణ.. ఇప్పటికీ తమిళనాట పాపులర్ లీడర్ గానే ఉన్నారు.

1969 నుంచి తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధి కీలక పాత్ర పోషించారు. డీఎంకేకు దాదాపు 48 ఏళ్లుగా ఆయనే అధ్యక్షుడు. ఇదైతే ప్రపంచ రికార్డని పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రపంచంలో ఏ నేత కూడా ఓ పార్టీకి ఇంత సుదీర్ఘ కాలం నేతృత్వం వహించలేదు. తమిళ్ సెంటిమెంట్, ద్రవిడ ఉద్యమ ప్రభావంతో కరుణ మాత్రం నిరాటంకంగా హవా సాగిస్తున్నారు. జర్నలిస్టుగా, కవిగా, నవలా రచయితగా, స్క్రిప్ట్ రైటర్ గా , నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా కరుణ చాలా ఫేమస్.
ఆయన మాటలు నేరుగా ప్రజల్లోకి చొచ్చుకెళ్తాయని అంటారు.

తెలుగులో పేరున్న చాలా మంది ఉపన్యాసకులైన నేతలు కూడా కరుణ తమిళ్ స్క్రిప్ట్ కు అనువాదం చేసుకునే పంచ్ లేస్తారని వాదన ఉంది. మొత్తం మీద తన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్న కరుణానిధి ప్రస్తుతం అంత యాక్టివ్ గా లేరు. పదేళ్లుగా ఇలాగే ఉన్న కరుణ.. పేరుకు సుదీర్ఘ కాలం అని చెప్పుకోవడమే కానీ.. నిజానికి ఆయన తనయుడు స్టాలిన్ చక్రం తిప్పుతున్నారనేది ఓపెన్ సీక్రెట్. ఏదేమైనా కరుణ రికార్డుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Leave a Reply