శశికళ దారిలో కరుణ…

0
348

Posted [relativedate]

 karunanidi wrote letter governor vidhyasagar jayalalitha sign true
రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి తాజాగా ఓ సందేహం లేవనెత్తారు.ఇటీవల అన్నాడీఎంకే నుంచి బహిష్కృతమైన రాజ్యసభ ఎంపీ శశికళ పుష్ప గుర్తుందా? అదేనండి ..మరో డీఎంకే ఎంపీ తో సాన్నిహిత్యంగా ఉన్న శశికళ పుష్ప.ఆమె నాలుగురోజుల కిందట జయ సంతకాన్ని ఫోర్జరీ చేసి పార్టీ పగ్గాలు ఇంకోరికి అప్పజెప్పేందుకు నెచ్చెలి శశికళ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.అదే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఇంచార్జి గవర్నర్ విద్యాసాగరరావు కి లేఖ రాశారు.

తాజాగా కరుణానిధి కూడా శశికళ పుష్ప దారిలో నడిచారు.పన్నీర్ సెల్వం కి జయ బాధ్యతలు అప్పగిస్తూ గవర్నర్ చేసిన ప్రకటనపై కరుణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.బాధ్యతల అప్పగింత ఫైల్ పై జయ సంతకం చేశారా అని ప్రశ్నించారు.ఫోర్జరీ అంటూ శశికళ మీద శశికళ పుష్ప వ్యక్తం చేసిన డౌట్ నే కరుణ కూడా పరోక్షంగా తెలియపరిచారు.సంతకం చేసే పరిస్థితి ఉంటే రాహుల్ ,వెంకయ్య ,స్టాలిన్ లు జయని కలవకుండా ఎందుకు నిరోధించారని కరుణ ప్రశ్న.పెద్దాయన ఈ సందేహాలు బయటపెట్టే కొద్దిసేపు ముందే పన్నీర్ సెల్వం కి బాధ్యతల అప్పగింతను ఆహ్వానించడం ఇందులో కొసమెరుపు.తండ్రికొడుకులది చెరో బాణీ..ఇదే కాబోలు తరాల మధ్య అంతరమంటే ..

Leave a Reply