కాశ్మీర్ పై చైనా వాగుడు..

0
549

kashmir china
కాశ్మీర్ అల్లర్లు ఆందోళన కలిగిస్తున్నాయన్న చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి తమ వ్యాఖ్యలన్నీ తమ వెబ్ సైట్లో పోస్ట్ చేసింది. జమ్మూకాశ్మీర్ కు సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయని చైనా తాజా వ్యూహాలు కలకలం సృష్టిస్తున్నాయి.. భారత్ – పాక్ మధ్య మాత్రమే సమస్యగా ఉన్న కశ్మీర్ అంశాన్ని నెత్తికెత్తుకుంటూ భారత్ ను దోషిగా చూపే ప్రయత్నాలు ప్రారంభించింది చైనా. రెండు దేశాల మధ్యా అవసరం లేకపోయినా జోక్యం చేసుకుని పెద్దరికం చూపించాలనుకుంటోంది.

చర్చల ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలంది.. అల్లర్ల సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఇదంతా ఏ ఐక్యరాజ్యసమితో చెబుతున్న సలహాలు కావు. ఎన్ఎస్జీలో భారత్ కు సభ్యత్వం రాకుండా.. అడుగడుగునా అడ్డుపడుతున్న మరో పొరుగు దేశం చైనా. భారత్ – పాక్ సమస్యకు ఇంటర్నేషనల్ ఇష్యూ కలరిచ్చేసి ప్రపంచ దేశాల దృష్టిలో మన దేశాన్ని విలన్ గా చూపేందుకు ప్రయత్నిస్తోంది..పచ్చగా ఉన్న కశ్మీర్ లో పాక్ చిచ్చు పెడుతుంటే.. భారత్ అంటే రగిలిపోతున్న మరో పొరుగు దేశం చైనా కూడా దీనిపై సన్నాయి నొక్కులు ప్రారంభించింది. కశ్మీర్ అల్లర్లలో జరుగుతున్న హింసపై మొసలికన్నీరు కారుస్తూ.. పరోక్షంగా భారత్ ను విమర్శించే ప్రయత్నం చేసింది.

పరిస్థితిని సమర్థవంతంగా చక్కబెడుతారని ఆశిస్తున్నామన్న చైనా.. అక్కడి పార్టీలతో చర్చలు జరిపి శాంతియుతంగా సమస్య పరిష్కరించుకోవాలని ఉచిత సలహాలు పడేసింది.హిజ్బుల్ కమాండర్ మృతి తర్వాత కశ్మీర్ అల్లర్లు పొరుగు దేశాల దృష్టిని కూడా ఆకర్షించగా.. వీటిని నిశితంగా గమనిస్తోంది చైనా. ఈ సమస్యకు అంతర్జాజీయ స్థాయి పబ్లిసిటీ తీసుకొచ్చి.. తప్పంతా భారత్ దే అని చెప్పే ప్రయత్నాలు చేస్తోంది.. పాకిస్థాన్ తో , కశ్మీర్ లోని వేర్పాటువాద నాయకులతో భారత్ శాంతిపూర్వకంగా చర్చలు జరపాలని చెప్పుకుంటూ వస్తోంది..కశ్మీర్ అల్లర్లలో ఇప్పటివరకూ 42 మంది మరణించకా.. 2 వేల మందికి పైగా గాయపడ్డారు.

Leave a Reply