కాశ్మీర్ వేడి తగ్గలేదు..

0
642

 kashmir war

దేశానికి కిరీటం అనదగిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కాశ్మీర్ లోయ ప్రాంతం ప్రస్తుతం అల్లకల్లోలంగా ఉన్నది. దాయాది దేశం పాకిస్తాన్ కుటిల చేష్టల ఫలి తంగా అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా తయారయ్యాయి. రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు భద్రతా దళాలు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ పరిస్థితులు చక్కబడడం లేదు. కాశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాలలో 33 రోజులుగా కర్ఫ్యూ కొనసా గుతోంది. తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ నేత బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ మృతి పర్యవసానంగా ప్రారంభమైన అల్లర్లు ఇంత వరకు అదుపులోకి రాలేదు.

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి నిరసనకారులపై బాష్పవాయు ప్రయో గం వంటివి నిష్ప్రయోజనం కావడంతో భద్రతా బలగాలు పెల్లెట్ గన్స్ ఉపయో గిస్తున్నారు. వాటి వల్ల కొందరి చూపు దెబ్బ తిన్నదంటూ సరికొత్తగా నిర సన ప్రదర్శనలు మొదలయ్యాయి. ఆ ప్రదర్శనలలో వైద్యులు కూడా భాగస్వాము లయ్యారు. లోయలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం ఎలా అని రాష్ట్ర ప్రభుత్వ నేతలతో పాటు కేంద్రం లోని పెద్దలూ తలలు పట్టుకుంటున్నారు. కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చేసిన ఒక వ్యాఖ్య నిరసన ప్రదర్శకులకు, ముఖ్యంగా వేర్పాటువాదులకు ఊతం ఇచ్చినట్లు అయింది.

బుర్హాన్ వనీని ఎన్‌కౌం టర్‌లో చంపి ఉండవలసింది కాదు అని ముఫ్తీ వ్యాఖ్యానించి పరిస్థితిని మరింత తీవ్రం చేశారు. ఈ అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఐక్య రాజ్య సమితికి లేఖ రాస్తూ కాశ్మీర్‌లో ప్లెబిసైట్ నిర్వహించాలన్న పాత పాట పాడారు. కాశ్మీర్‌లో పరిస్థితిపై చర్చించే నిమిత్తం సిఎం మెహబూబా ముఫ్తీ మంగళవారం ఢిల్లీలో ముందు కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోను, ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోడీతోను భేటీ అయ్యారు. వాస్త వానికి మెహ బూబా ముఫ్తీ ఒక విధంగా ఇరకాట పరిస్థితిని ఎదుర్కొం టున్నారు. ఆమె గతంలో హురియత్ కాన్ఫరెన్స్ నేతలు వంటి వేర్పాటువా దులకు మద్దతుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండేవారు.

ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కలసి పాలనా పగ్గాలు చేపట్టిన తరువాత ఆమె ఆవిధంగా మాట్లాడేందుకు వెనుకాడుతున్నారు. అయినా బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ మృతిపై వ్యాఖ్యలతో ముఫ్తీ విమర్శలకు గురయ్యారు. ఇది ఇలా ఉండగా, కాశ్మీర్‌లో పరిస్థితులపై ప్రతిపక్షాల అభ్యర్థనను పురస్కరించుకుని బుధవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఎనిమిది గంటల సేపు సాగిన చర్చ అనంతరం హోమ్ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాధానం ఇస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ కాశ్మీర్ అశాంతిపై శుక్రవారం అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతారని ప్రకటించారు. అంతకు ముందు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, జమ్మూ కాశ్మీర్ నేత గులామ్ నబీ ఆజాద్ చర్చలో పాల్గొంటూ ప్రధాని మోడీపై విమర్శలు చేశారు.

ప్రధాని కాశ్మీర్‌పై ‘చాలా ఆలస్యంగా’ వ్యాఖ్యలు చేశారని ఆజాద్ విమర్శించారు. పైగా పార్ల మెంట్‌లో కాకుండా మధ్య ప్రదేశ్‌లో ఒక ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శించిన ఆజాద్ కాశ్మీర్ సమస్యపై చర్చించడం ఇది నాలుగవ సారి అని చెప్పారు. ప్రధాని హాజరు కావాలని, కాని ఆయన కాశ్మీర్‌పై మాట్లాడేందుకు మధ్య ప్రదేశ్‌ను ఎంచుకున్నారని, ఆయన ఈ సభకు రావాలని అన్నారు. అంతే కాదు. మధ్య ప్రదేశ్ దేశానికి రాజధాని ఎప్పటి నుంచి అయిందని ఆజాద్ ప్రశ్నించారు. మోడీ పార్లమెంట్‌లోని తన గదిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొం టుంటారని తమకు తెలుసని కూడా ఆజాద్ చెప్పారు.

యుపిఎ 1, 2 హయాం లలో విశ్వాస నిర్మాణ చర్చలు పెక్కింటిని తీసుకున్నట్లు చెప్పిన ఆజాద్ ఇప్పుడు కొరవడ్డాయని అన్నారు. ఇందుకు స్పం దించిన రాజ్‌నాథ్ తాను ప్రధాని నరేంద్ర మోడీ తరఫున మాట్లాడుతున్నానని స్పష్టం చేస్తూ, కాశ్మీర్ పరిస్థితి పట్ల ప్రధాని చాలా ఆందోళనతో ఉన్నారని తెలియజేశారు. కాశ్మీర్‌లో వాస్తవ పరిస్థితిని విశ్లే షించిన తరువాత అక్కడికి అఖిల పక్ష బృందాన్ని పంపే విషయం పరిశీలిస్తామని మంత్రి వాగ్దానం చేశారు. రాజ్యసభలో చర్చ సందర్భంలోనే రాజ్ నాథ్ పాకిస్తా న్‌కు ఒక హెచ్చరిక కూడా చేశారు. కాశ్మీర్‌లో ప్లెబిసైట్ కోసం నవాజ్ షరీఫ్ యుఎన్‌కు లేఖ రాశారన్న వార్తను ప్రస్తావిస్తూ రాజ్‌నాథ్ సింగ్ ఈ భూమిపై ఏ శక్తీ కాశ్మీర్‌ను మన నుంచి లాక్కోలేదని ఢంకా బజాయించి చెప్పారు.

కాశ్మీర్‌పై మాట్లాడే ప్రసక్తి లేదని, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై మాత్రమే వారితో మాట్లాడతామని హోమ్ మంత్రి స్పష్టం చేశారు. కాశ్మీర్ లోయలో పౌర పాలనా యంత్రాంగం అధికారులు, భద్రతా దళాల కుటుంబ సభ్యులకు లష్కరే తయ్యిబా టెర్రరిస్టులు బెదరింపులు జారీ చేస్తున్నారని ఆయన ఆరోపిం చారు. భారత భూభాగంపై ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలను సహించ బోమని కూడా ఆయన చెప్పారు. రానున్న కొన్ని రోజులలో అమర్‌నాథ్ యాత్ర ముగిసిన తరువాత లోయ పాలనా యంత్రాంగాన్ని సైన్యానికి ప్రభుత్వంవ అప్ప గించబోతున్నదా అని ఆజాద్ చర్చ సమయంలో అడిగారు. ఇందుకు రాజ్‌నాథ్ స్పందిస్తూ, కాశ్మీర్‌ను సైన్యానికి అప్పగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అటు వంటి వదంతులను ‘దురుద్దేశపూర్వకంగా’ వ్యాపింప చేస్తున్నారని మంత్రి అన్నారు.

విస్త­ృత చర్చ అనంతరం రాజ్యసభ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమో దిస్తూ శాంతి సామరస్యాలు పునరుద్ధరించవలసిందిగా కాశ్మీర్ లోయ వాసులకు విజ్ఞప్తి చేసింది. దేశ భద్రతపై ఏమాత్రం రాజీ పడేది లేదని సభ ఆ తీర్మానంలో స్పష్టం చేసింది. కాశ్మీర్ పరిస్థితిపై రాజ్యసభలో చర్చ సందర్భంగా బిజెపి కాకుండా ఎస్‌పి ‘గత తప్పిదాలు కొన్నిటి’ పర్యవసానమే ఈ సమస్య అని పేర్కొనడం గమనార్హం. దేశ విభజన, 1965, 1971 యుద్ధాలలో భారత్ విజయం అనం తరం పాకిస్తాన్ నుంచి బలమైన వాగ్దానాలు రాబట్టలేకపోవడం వాటిలో భాగమని ఎస్‌పి పేర్కొన్నది.

జూలై 25న జమ్మూ కాశ్మీర్‌లో పట్టుబడిన ఉగ్రవాది బహుదూర్ అలీ ద్వారా కాశ్మీర్ విషయమై పాక్ కుటిల బుద్ధి మరొకసారి బట్టబయలైౖంది. అతనిని మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎన్ఐఎ అధికారులు ఈ సందర్భంగా ఉగ్రవాదులకు సంబంధించిన కీలక ఆధారాలను, పాకిస్తాన్ కుటిల బుద్ధిని బహిర్గ తం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో లష్కరే తయ్యిబా క్యాంపులు నిర్వహి స్తోం దని, ప్రతి క్యాంపులో 30 నుంచి 50 మంది సభ్యులు ఉన్నారని ఎన్ఐఎ అధికా రులు వెల్లడించారు. ఈ క్యాంపుల్లో ఉగ్రవాదులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పా టు చేసి, ప్రణాళికాబద్ధంగా పాక్ సైన్యం సాయంతో శిక్షణ ఇస్తోందని వారు వెల్ల డించారు. కాశ్మీర్ పరిస్థితులను అవకాశంగా మలుచుకోవాలని లష్కరే తయ్యి బా భావిస్తోందని వారు తెలిపారు. బహుదూర్ అలీ వంటి ఉగ్రవాదులను సరి హద్దు లు దాటించిందని వారు చెప్పారు.

Leave a Reply