కాష్మోరా మూవీ రివ్యూ…

0
658
kashmora movie review

 Posted [relativedate]

kashmora movie reviewచిత్రం : కాష్మోరా (2016)
నటీనటులు : కార్తీ, నయనతార, శ్రీదివ్య
సంగీతం : సంతోష్ నారాయణణ్
దర్శకత్వం : గోకుల్
నిర్మాత : ఎస్.ఆర్ ప్రకాష్ బాబు, ఎస్.ఆర్ ప్రభు
రిలీజ్ డేట్ : అక్టోబర్ 28, 2016.

ఫస్ట్ లుక్ నుంచే అంచనాలు పెంచేసిన చిత్రం ‘కాష్మోరా’. కార్తీ మూడు విభిన్నమైన గెటప్ లు.. టీజర్ లో యుద్దనేపథ్యంలో సాగే సన్నివేశాలు’కాష్మోరా’పై క్రేజ్ ని పెంచేలా చేశాయి. ఈ హిస్టారికల్ హర్రర్ థ్రిల్లర్ చిత్రాన్ని ఏకంగా ‘బాహుబలి’తో పోల్చారు. బాహుబలి టెక్నిషన్స్..ఈ చిత్రానికి కూడా పనిచేయడం ఈ పోలికకి ఓ కారణంగా చెప్పవచ్చు.గోకుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తీ సరసన నయనతార, శ్రీదివ్య నటించనున్నారు. భారీ అంచనాలు.. అంతుకుమించి ‘బాహుబలి’ని తలదన్నె చిత్రంగా నిలుస్తుందని ప్రచారం సాగిన కాష్మోరా దీపావఌ కానుకగా ఈరోజు (అక్టోబర్29)న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. కాష్మోరా ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది. ఇంతకీ ‘కాష్మోరా’ కథేంటీ తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :
700యేళ్ల క్రితం నాటి కథ.ఆరోజుల్లో విక్రాంతక రాజ్ నాయక్ అనే రాజు.వీరపరాక్రముడు.ఎన్నో యుద్దాల్లో జయకేతనం ఎగరవేసిన వీరుడు. విజయాన్ని తలకెక్కించుకొన్న రాజు.. స్త్రీలోలుడుగా మారతాడు. రాజ్ నాయక్ కళ్లు రాణి రత్నమహాదేవిపై పడతాయ్. ఆమెని బలవంతంగా పెళ్లాడతాడు కూడా. థ్రిల్లింగ్ కి గురిచేసే ఈ ఏపీ సోడ్ ని తెరపై చూస్తేనే బాగుంటుంది.

ఇక, ప్రజెంట్ టైంలోకి వస్తే..కార్తీ (కాష్మోరా) ఓ అవారా.ఓ లక్ష్యమంటూ ఏమీ లేదు.జనాలకు ఉన్న దెయ్యాలు,మంత్రాల వాటిపై ఉన్న నమ్మకాలపై ఆడుకుంటూ డబ్బు సంపాదిస్తూంటాడు కార్తీ. అతని తండ్రి కూడా ఫేక్ బాబా. ఫ్యామిలీ అంతా ఇలాంటి టైపే. శ్రీదివ్య (యామినీ) దెయ్యాలపై రిసెర్చ్ చేసే స్టూడింట్. కార్తీ ఫ్రాడ్ ని బయటపెట్టేందుకు అతనితో టచ్ లో ఉంటుంది. అయితే, రాజ్ నాయక్ సంస్థానంలోకి కాష్మోరా అడుగుపెట్టాల్సి వస్తోంది. ఇంతకీ.. కాష్మోరా అక్కడకికి ఎందుకు వెళ్లాడు.. ? కాష్మోరా అడుగుపెట్టిన తర్వాత అక్కడ చోటు చేసుకున్న పరిణామాలేమిటి.. ? అన్నది మిగితా కథ.

ఫ్లస్ పాయింట్స్ :
* కార్తీ నటన
* హర్రర్ + కామెడీ
* సెకాండాఫ్

మైనస్ పాయింట్స్ :
* అక్కడక్కడ సాగదీత
* నివిడి

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
హిస్టారికల్ మూవీ. అందులోనూ హర్రర్ థ్రిల్లర్. ఖచ్చితంగా అరుంధతి, బాహుబలి.. లాంటి ఫ్లాష్ బ్యాక్ ఏపీసోడ్ అవసరం.దర్శకుడు గోకుల్ కూడా అదే చేశాడు. 700యేళ్ల నాటి.. ఏడు తరాల ప్లాష్ బ్యాక్ ని రాసుకొన్నాడు. అది ‘కాష్మోరా’ని నిలబెట్టింది. అందులో కార్తీని చూపించిన విధానం సూపర్భ్. 700యేళ్ల నాటి కథకి.. ప్రజెంట్ కథని కనెక్ట్ చేయడంలోనూ సక్సెస్ అయ్యాడు. సినిమాలో కార్తీ నటన హైలైట్. మూడు విభిన్నమైన గెటప్ లలో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఏపీసోడ్ లో ఇరగదీశాడు.రత్నమహాదేవి పాత్రలో నయనతార ఒదిగిపోయింది. శ్రీదివ్య బాగా నటించింది. మిగితా నటీనటులు ఓకే అనిపించారు.

సాంకేతికంగా :
ముందుగా విజువల్ ఎఫెక్ట్స్ గురించి చెప్పుకోవాలి. ‘బాహుబలి’ చిత్రానికి పనిచేసిన టెక్నిషన్స్ ఈ చిత్రానికి కనిపించారు. దీంతో.. బాహుబలి రేంజ్ లో కాష్మోరా విజువల్ ఎఫెక్ట్స్ ఉండనున్నాయనే ప్రచారం జరిగింది. బాహుబలి రేంజ్ లో కాకున్నా.. విజువల్ ఎఫెక్ట్ బాగున్నాయి. హర్రర్ థ్రిల్లర్ సినిమాకి నేపథ్య సంగీతం ప్రధాన బలం. సంతోష్ నారాయణణ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. అక్కడ కొన్ని సన్నివేశాలకు కత్తెర పెట్టవచ్చు. మొత్తంగా.. తెరపై కాష్మోరా కాస్లీగా కనిపిస్తాడు. పెట్టిన బడ్జెట్ రేంజ్ లో సినిమా అవుత్ పుట్ ఉందనే చెప్పాలి.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
డిఫరెంట్ చిత్రాలని ఇష్టపడే ప్రేక్షకులకి ‘కాష్మోరా’ బాగా నచ్చేస్తోంది.బాహుబలి కాదు గానీ.. అరుంధతి సరసన చేరే అర్హతలు గల చిత్రం ‘కాష్మోరా’.తెలుగు స్టార్స్ సినిమాల దీపావళీ హంగామా ఎలాగూ లేదు. ఆ లోటుని కార్తీ కాష్మోరా తీర్చనుంది.

బాటమ్ లైన్ : కాష్మోరా.. హర్రర్+కామెడీ
రేటింగ్ : 3.5/5

Leave a Reply