Wednesday, December 8, 2021
HomeEntertainmentCinema Latestరజినీ ‘కాలా’ కొత్త వివాదం

రజినీ ‘కాలా’ కొత్త వివాదం

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ప్రస్తుతం రంజిత్‌ పా దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘కాలా’. మాఫియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా ముందు నుండే ప్రచారం జరుగుతుంది. ముంబయి ఒక ప్రముఖ మాఫియా డాన్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందనే వార్తలు రావడంతో మాఫియా నుండి బెందిరింపులు కూడా వచ్చాయి. అయితే చిత్ర యూనిట్‌ సభ్యులు ఇది ఎవరిని ఉద్దేశించినది కాదు అంటూ ప్రకటించింది. తాజాగా మరో వివాదంలో ‘కాలా’ చిత్రం ఇరుక్కోవడం జరిగింది. ప్రస్తుతం రజినీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘కాలా’ చిత్రం కథ నాది అంటూ ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించడం జరిగింది.

ధనుష్‌ తండ్రి అయిన కస్తూరి రాజా వద్ద కొంత కాలం క్రితం రాజశేఖరన్‌ అనే వ్యక్తి అసిస్టెంట్‌గా చేసేవాడు. ఆ సమయంలోనే రాజశేఖరన్‌ ఒక కథను రజినీకాంత్‌ కోసం సిద్దం చేశాడు. ఆ కథకు ‘కరికాలన్‌’ అనే టైటిల్‌ను కూడా రిజిస్ట్రర్‌ చేయించడం జరిగింది. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఆ సినిమా కథను అప్పట్లో కస్తూరి రాజాకు చెప్పడం, ఇప్పుడు అదే కథతో రంజిత్‌ పా దర్శకత్వంలో ధనుష్‌ నిర్మాణంలో రజినీకాంత్‌ హీరోగా ‘కాలా’ సినిమా తెరకెక్కడం జరుగుతుందని రాజశేఖరన్‌ ఆరోపిస్తున్నాడు. అయితే రాజశేఖరన్‌ ఆరోపణలను చిత్ర యూనిట్‌ సభ్యులు కొట్టి పారేస్తున్నారు. తాజాగా రాజశేఖరన్‌ చైన్నై పోలీస్‌ కమీషనర్‌కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు విచారణ ప్రారంభించారు. ఈ వివాదం ఎక్కడకు దారి తీస్తుందో అని సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.

- Advertisment -
spot_img

Most Popular