పయ్యావులను పక్కన బెట్టేశారా?

0
310
kasyap is kept side

Posted [relativedate]

kasyap is kept side
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పయ్యావుల కేశవ్ ఎంతో కష్టపడ్డారు. అసెంబ్లీలోనూ, బయటా టీడీపీ వాయిస్ ను బలంగా వినిపించారు. కొన్ని సందర్భాల్లో వైఎస్ వర్గంతోనూ ఢీ కొట్టారు. దీంతో చంద్రబాబు కూడా ఆయనకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఆయన టైమ్ బాలేదు. ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఆ దెబ్బతో ఆయన రాజకీయ జీవితమే తలకిందులైపోయింది.

గెలిస్తే ప్రధాన మంత్రిత్వ శాఖ దక్కేదంటారు పయ్యావులకు. కానీ ఓడిపోయిన తర్వాత ఆయన పరిస్థితి మారింది. రాజకీయాల్లో ఆయన కంటే జూనియర్లు కూడా పార్టీలో దూకుడు పెంచారు. అదే సమయంలో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గుతూ వస్తోందట. ఎమ్మెల్సీ ఇచ్చినా.. పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పయ్యావులకు అవకాశం ఇవ్వడం లేదని చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు ఇతర పార్టీలపై విమర్శల దాడి చేయాలంటే పయ్యావుల గుర్తుకొచ్చేవారు..కానీ ఇప్పుడాయన మీడియా సమావేశాల్లో కనిపించలేదు. పార్టీ నాయకులు కూడా ఇదే విషయంపై గుసగుసలాడుకుంటున్నారు. తాజాగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా ఇదే మాటను చెప్పుకొచ్చారు. పయ్యావులనే పట్టించుకోకుంటే.. మా పరిస్థితి ఏంటని ప్రశ్నించారాయన.

జేసీ నోట ఒక మాట వచ్చిందంటే.. అందులో వాస్తవం ఉంటుందని చెబుతారు పరిశీలకులు. ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారాయన. అందుకే పయ్యావులకు పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదన్న మాట నిజమేనంటున్నారు ఆయన అనుచరులు.

Leave a Reply