కాటమరాయుడు రివ్యూ&రేటింగ్ వచ్చేసిందిగా..!!

 Posted March 23, 2017

అవును మీరు విన్నది నిజమే. కాటమరాయుడు రివ్యూ&రేటింగ్ వచ్చేసింది. అదేంటి రేపు కదా రిలీజ్.. ఇవాళే ఎలా రివ్యూ వచ్చేసింది అనేగా మీ డౌట్.. అక్కడికే వస్తున్నాం. ఈ రేటింగ్ ఇచ్చింది UAE సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధూ. ఓవర్సీస్ లో ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోల ద్వారా విడుదలైంది కాటమరాయుడు సినిమా.  కాటమరాయుడు సినిమా మొట్టమొదట రివ్యూ  ఇదేనని ఉమైర్ సంధూ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పిన ఆయన కాటమరాయుడికి  4/5 రేటింగ్ ని ఇచ్చారు.

పవన్ కళ్యాణ్, శృతిహాసన్ కెమిస్ట్రీ బాగుందని, సాంగ్స్, ఫైట్స్ ఒకదాన్ని మించి మరొకటి ఉన్నయని వెల్లడించారు. స్టోరీ కొత్తది కాకపోయినా, కధనంతో దర్శకుడు మాయచేశాడని, మొత్తంగా అభిమానులు పెట్టుకున్న అంచనాలను సినిమా అధిగమిస్తుందని తెలిపారు. దీంతో పండగ రేపే అయినా సెలెబ్రేషన్స్ మాత్రం ఈ రోజే చేసుకుంటున్నారు పవన్ అభిమానులు.

SHARE