కాటమరాయుడు ఫంక్షన్ లో ఆ సినిమా చూపించారే…

Posted March 19, 2017

katamarayudu function resembles a movie
కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నువ్వంటే నాకిష్టం సినిమా గుర్తుకొచ్చింది.ఈ సినిమాకి పని చేసిన చాలా మంది నువ్వంటే నాకిష్టం అని తమకి నచ్చిన వాళ్ళ గురించి చెప్పారు.ఇలా చెప్పినవారిలో బాగా ఇంటరెస్టింగ్ గా అనిపించింది రెండు విషయాలు. అందులో మొదటిది టీవీ 9 రవిప్రకాష్ చెప్పిన మాటలు.ఆయనకి ఈమధ్య పవన్ కళ్యాణ్ బాగా నచ్చుతున్నారట.ఆయనంటే ఇష్టం ఏర్పడిందట.ఎందుకనేదానికి కూడా ఆయన వివరణ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో పవన్ లా ఇంకెవరైనా పని చేసి ఉంటే ఆ తర్వాత దాన్ని అడ్డం పెట్టుకుని సంపాదనలో పడేవారని..కానీ పవన్ ఆ మకిలి అంటకుండా వున్నారని రవి ప్రకాష్ మెచ్చుకున్నారు.ఏపీ కి ప్రత్యేక హోదా,పెద్ద నోట్ల రద్దు వంటి అంశాల్లో మీడియా కూడా దూకుడుగా వ్యవహరించలేకపోతున్నా …పవన్ నిర్భీతిగా మాట్లాడటాన్ని రవి ప్రకాష్ ప్రశంసించారు.ఎన్నికల ముందు ఓ మాట,ఎన్నికల తర్వాత ఇంకో మాట చెప్పే రాజకీయాలకు భిన్నంగా పవన్ ముందుకెళ్లడాన్ని ఆయన స్వాగతించారు. సత్యం కోసం నిలబడడం అంత తేలికకాదని రవిప్రకాష్ అన్నారు.

రవిప్రకాష్ మాట్లాడాక నిర్మాత బండ్ల గణేష్ మైక్ అందుకుని కాసేపు హడావిడి చేసాడు . ముందుగా రవిప్రకాష్ అంటే ఇష్టం లేదని చెప్పి స్పీచ్ మొదలు పెట్టి చివరిగా మీలో కూడా పవన్ లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇష్టపడుతున్నానని అన్నారు.ఇలా బండ్ల వాక్చాతుర్యం చూసి పవన్, త్రివిక్రమ్,రవిప్రకాష్ నవ్వుకోవడం కనిపించింది.ఇలా మొత్తానికి కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నువ్వంటే నాకిష్టం సినిమా చూపించేసారు..

SHARE