Posted [relativedate]
సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత కాటమరాయుడిగా వస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ సినిమాపై పవన్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఓ మంచి సక్సెస్ కోసం పవర్ స్టార్ ఎదురుచూస్తున్నాడు. ఇటీవల రిలీజైన కాటమరాయుడికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయినప్పటికీ ఈ సినిమాను ఓ భయం వెంటాడుతోంది.
తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వీరమ్ సినిమాను .. కాటమరాయుడు పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే వీరమ్ సినిమా ఇప్పటికే తెలుగులోకి డబ్ అయ్యింది. అంతేకాదు బుల్లితెరపై కూడా వచ్చేసింది. ఒకటి కాదు రెండు కాదు చాలాసార్లు ఈ సినిమా తెలుగు ఛానల్స్ లో ప్రసారమైంది. ఈ మధ్య ఒక ఛానల్… ఈ వీరమ్ సినిమాను ప్రతివారం సీరియస్ గా కూడా ప్రసారం చేస్తోంది. సినిమా కంటెంట్ అంతా ప్రేక్షకులకు తెలిసిపోయింది. దీంతో కాటమరాయుడు సబ్జెక్ట్ ఏంటో కూడా అప్పుడే అంచనా వేస్తున్నారు జనం.
మామూలుగా సినిమాల్లో గెటప్ నే రివీల్ కాకుండా జాగ్రత్తగా పడుతుంటారు హీరోలు. అలాంటిది పవన్ కల్యాణ్ లాంటి బడా హీరో సినిమా స్టోరీయే జనాలకు తెలిసిపోతే.. పరిస్థితి ఊహించడం కష్టమే. అయితే కాటమరాయుడు యూనిట్ మాత్రం తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్నిమార్పులు చేశామని చెబుతోంది. మాటలెన్ని చెప్పినా ఒక్కటి మాత్రం నిజం. వీరమ్ డబ్బింగ్ సినిమా ప్రభావం… కాటమరాయుడిపై ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ డబ్బింగ్ సినిమా బుల్లితెరకు రాకుండా చూసుకొని ఉంటే ఈ పరిస్థితి రాకపోయేదంటున్నారు. అటు తిరిగి…ఇటు తిరిగి కాటమరాయుడు కలెక్షన్లకు ఈ వీరమ్ ఏమైనా దెబ్బ కొడుతుందా… అని పవన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.