Posted [relativedate]
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గరపడుతుండడంతో అభిమానుల ఆసక్తిని మరింత పెంచే విధంగా నిన్న సాయంత్రం చిత్ర యూనిట్ టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేసింది.
నాయకుడై నడిపించేవాడు… సేవకుడై నడుం వంచే వాడు… మిర మిర మీసం తిప్పుతాడు జనం కోసం…అంటూ సాగే ఆ సాంగ్ విడుదలైన 50 నిమిషాల్లోనే 3 లక్షల వ్యూస్ ను సాధించి రికార్డు సెట్ చేసింది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ పాటను విన్న కొంతమంది విశ్లేషకులు మాత్రం ఇది సినిమా పాట లేక జనసేన పార్టీ ప్రచారపు పాట ఆని విమర్శిస్తున్నారు.
టైటిల్ సాంగ్ అంటే హీరోని ఇంట్రడ్యూస్ చేయడమో, అతని ఫ్యామిలీనో, ఫ్రెండ్స్ నో లేక అతని లైఫ్ స్టైల్ నో చూపించాలి. అంతేకానీ అభిమానుల రక్తంలో రాజకీయవేడిని పెంచేలా ఉండకూడదంటున్నారు. ఈ పాటలోని ప్రతి పదం సినిమా పాటకు సంబంధించినదిగా లేదని, పవన్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించినట్లు ఉన్నదని అంటున్నారు. పవన్ ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చే ముందు తన ఇమేజ్ ని పెంచుకోడం కోసం ఇలాంటి ఘాటైన పదాలు ఉండేలా పాటను రెడీ చేశాడా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కాగా మరికొందరు పవన్ ఏది చేసినా డైరెక్ట్ గా చేస్తాడని, సినిమాలను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రచారం చేసే చౌకబారు స్ధితిలో పవన్ లేడని వారి వ్యాఖ్యాలను ఖండిస్తున్నారు. సినిమాలో అతని క్యారక్టర్ ఊరికి ఉపకారం చేసే మనిషి కాబట్టి.. అటువంటి లిరిక్స్ వాడారని చెబుతున్నారు. ఏది ఏమైనా పవన్ పాట బాగుంది కాబట్టి విని ఎంజాయ్ చేయాలి. అంతే తప్ప విమర్శలు.. ప్రతివిమర్శల జోలికి పోకుండా ఉండడమే బెటర్.. ఏమంటారు ఫ్రెండ్స్…