కాటమరాయుడు ముందేవస్తున్నాడుగా..!!

Posted February 15, 2017

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. కాటమ రాయుడు వారం రోజులు ముందుగానే ప్రేక్షకులను పలకరించనున్నాడు. శరత్‌ మరార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు డాలీ దర్శకత్వం వహిస్తుండగా పవన్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.  

కాగా మొదట ఈ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఫిబ్రవరి 4న  విడుదలైన కాటమరాయుడు టీజర్ కి విశేష స్పందన వచ్చింది. ‘ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడు ఉన్నాడన్నది ముఖ్యం’ అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ ఉన్న ఆ టీజర్ ఇప్పటికీ యూట్యూబ్‌ ట్రెండింగ్‌ లో మొదటి స్థానంలో ఉంది.

మార్చిలో పరీక్షలు ఉంటాయి కాబట్టి ఈ సినిమాను ముందు మార్చి29న విడుదల చేయాలనుకున్నామని, అయితే టీజర్ కి అనూహ్య స్పందన రావడంతో సినిమాను ముందుగానే విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్ తెలిపింది. అంటే మార్చి 24నే సినిమా రిలీజ్ కానుంది.

టీజర్ విషయంలో యూట్యూబ్ రికార్డులను బ్రేక్ చేసిన పవన్ సినిమా రిలీజ్ తర్వాత ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి

SHARE