బాహుబలికి కట్టప్ప తలనొప్పి…

Posted March 22, 2017

katappa fever in karnataka
పరభాషా చిత్రాల విషయంలో మళ్లీ కర్ణాటకలో అగ్గి రాజుకుంటోంది.కన్నడ మార్కెట్ మీద కూడా భారీ ఆశలు పెట్టుకున్న బాహుబలి నిర్మాతలు ఈ హర్డిల్ ఎలా దాటాలా అని ఆలోచిస్తుంటే ..ఇంతలో కట్టప్ప రూపంలో ఇంకో చిక్కొచ్చి పడింది.కట్టప్ప వున్న సినిమా తమ గడ్డ మీద విడుదల కానీయబోమంటూ కన్నడ సంఘాలు తేల్చి చెబుతున్నాయి.కట్టప్ప ..ఓ కెట్టప్ప(చెడ్డవాడు ) అని నినాదిస్తున్నాయి.సినిమాలో బాహుబలిని చాటుగా దెబ్బేసిన కట్టప్ప ఇప్పుడు ఇలా పరోక్షంగా బాహుబలికి తలనొప్పిగా మారాడు.కన్నడ సంఘాలు కట్టప్ప విషయంలో ఇంతగా పట్టుదలకు పోవడం వెనుక ఓ ఫ్లాష్ బ్యాక్ వుంది..

ఉన్నది సినీ రంగమే అయినా రాజకీయ,సామాజిక అంశాల మీద స్పందించడంలో ముందుంటాడు కట్టప్ప పాత్రధారి సత్య రాజ్. కావేరి జలాల అంశంలో కర్ణాటక,తమిళనాడు మధ్య అగ్గి రాజుకున్న టైం లో సత్య రాజ్ తమ రాష్ట్ర ప్రజల కోసం కొంత దూకుడుగానే మాట్లాడారు.ఇప్పుడు ఆ విషయాన్ని ముందుకు తెచ్చి సత్య రాజ్ క్షమాపణ చెబితే గానీ బాహుబలి 2 విడుదలకి ఒప్పుకోబోమని కన్నడ సంఘాలు షరతు పెడుతున్నాయి.ఇప్పుడు ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించాలో బాహుబలి టీం కి అర్ధం కావడం లేదు.ఏమైనా సినిమాలో లాగానే బయట కూడా బాహుబలికి కట్టప్ప ముప్పు పొంచి వుంది.

SHARE