హద్దులు దాటిన కత్రిన కైఫ్..

0
826

katrina-adult-image

ఏదో.. కత్తిగట్టినట్టు కత్రిన అందాల ప్రదర్శన చేస్తోంది. అవకాశాల కోసమో.. ఏమో గానీ.. ‘బార్ బార్ దేఖో’లో రెచ్చిపోయింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తున్న వారందరికీ ఆఖరికి ఈ ఫీలింగే కలుగుతోంది. అసలు విషయానికొస్తే.. నిత్య మెహ్రా తెరకెక్కించిన ‘బార్ బార్ దేఖో’లో అందాల కత్రిన ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసింది. ఇక హీరో సిద్ధార్ధ్ మల్హోత్రాతో అమ్మడి బోల్డ్‌ సీన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇలాంటి దృశ్యాల్లో ఈ లండన్ సుందరి ఇటీవలిగా కనిపించింది లేదు. మొదటి సినిమాలో ఏదో తెలీక కొన్ని సెక్సీ సీన్స్‌లో నటించేసింది. ఆ తర్వాత కత్రినా విశ్వరూపం చూడ్డం ఇదే తొలిసారి.

హీరోహీరోయిన్ల రొమాంటింగ్ ఎన్‌కౌంటర్స్, కిస్సింగ్స్‌తోనే ‘బార్ బార్ దేఖో’ ట్రైలర్ నిండిపోయింది. ఇక నియాన్ పింక్ కలర్ బికినీలో కత్రినాను చూసిన వారికి నోటమాట రావడంలేదు. ఇదంతా సినిమాల్లో ఛాన్సుల కోసమే అని కొందరు అంటున్నారు. రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకుంటుందిలే అనుకుని బాలీవుడ్ ఈ అమ్మడిని పక్కనపెట్టింది. ప్రస్తుతం రణ్‌బీర్‌తో విడిపోవడంతో ఈ సొగసరి అందరినీ ఆకట్టుకునే పనిపెట్టుకుందని.. దానిలో భాగంగానే బోల్డ్ యాక్ట్‌కు సిద్ధమైపోయిందని చెప్పుకుంటున్నారు.

Leave a Reply