డ్రైవర్ తో కత్రినా.. ఆ పరిస్థితి తెచ్చుకొంది !

Posted October 8, 2016

   katrina kaif real life secrets driver reveals

బాలీవుడు ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ ఈ మధ్య తరచూ వార్తలు నిలుస్తోంది. ఆమె సీక్రెట్స్ అన్ని మీడియాకి లీకవుతున్నాయి. రణబీర్ కపూర్‌తో బ్రేకప్ అయిన
విషయం లైవ్ అప్ డేట్స్ లా వార్త పత్రికల్లో వచ్చేసింది. ఆదిత్యారాయ్ కపూర్‌తో స్నేహంగా కూడా అంతే. అంతేకాదు.. రోజు వారి అప్ డేట్స్ అన్ని
లీకవుతున్నాయ్. దీంతో.. ఈ పని ఇంటిదొంగ పనై ఉంటుందని తన దగ్గర పని చేసే మనుషులపై ఫోకస్ చేసిందట కత్రినా.

డ్రైవర్ ని గట్టిగా గదిస్తే.. అసలు విషయం తెలిసింది. కత్రినా అప్ డేట్స్ లీక్ చేస్తోంది ఆమె కారు డ్రైవర్ నే అట. మీడియాకి రహస్యాలు చేరవేసి, అతగాడు డబ్బులు తీసుకుంటున్నాడని తెలిసి, కత్రినా ఖంగుతిన్నారని సమాచారమ్. దీంతో డ్రైవర్ తో పాటు, తన దగ్గర పనిచేసేవారందరికీ పెద్ద క్లాస్ పీకిందట ఈ హాట్ బ్యూటీ. మొత్తానికి డ్రైవర్ చేసిన లీకుల వల్ల ఈ బ్యూటీకి మనశ్శాంతి లేకుండాపోతోందట.

SHARE