లోకేష్ కి కవిత ఇచ్చిన సలహా?

 Posted October 21, 2016

 kavitha advice lokesh be focused on ap politics
ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ కి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె కవిత ఓ సలహా ఇచ్చారు.అదేమిటంటే …తెలంగాణ గురించి వదిలేసి ఆంధ్ర రాజకీయాలు పట్టించుకుంటే లోకేష్ కి మేలంటూ ఆమె సూచించారు.ఆస్తుల ప్రకటన టైం లో తెలంగాణ విషయాల్ని మాట్లాడిన లోకేష్ కి కవిత తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.ఆస్తుల వెల్లడి గురించి తమకి ఎవరి సలహాలు అక్కర్లేదని లోకేష్ ని ఉద్దేశించి కవిత అన్నారు.బాబులా అడ్డగోలు సంపాదన తమకి లేదని ఆమె విమర్శించారు.తమ ఆస్తుల గురించి తాము ఎవరికి చెప్పాలో వారికి చెప్తామని కవిత వ్యాఖ్యానించారు.తెలంగాణాలో కొత్త జిల్లాల ఏర్పాటు గురించి లోకేష్ కి ఏమి తెలుసని ఆమె నిలదీశారు.ఇలాంటి మాటలు వదిలేసి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కవిత సలహా ఇచ్చారు .

SHARE