తండ్రికి అండగా కవితమ్మ ..

 kavitha support her father kcr fires congress tdp politician
మహారాష్ట్రతో ప్రాజెక్టు ఒప్పందాలపై తెలంగాణ సీఎం కెసిఆర్ కి అండగా అయన కుమార్తె,నిజామాబాదు ఎంపీ కవిత ముందుకొచ్చారు.అనవసర విమర్శలు చేస్తే జైళ్ళకి పంపుతామంటూ కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వస్తున్న సందర్భంలో కవిత వాటికి కౌంటర్ ఇచ్చారు.కాంగ్రెస్,టీడీపీ లు కెసిఆర్ వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు.మహారాష్ట్రతో జరిగిన ఒప్పందాల్లో తెలంగాణ తలవంచిందన్న ఆరోపణల్ని ఆమె తిప్పికొట్టారు.

కెసిఆర్ ని తీవ్రపదజాలంతో విమర్శించే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై కవిత ఎదురుదాడికి దిగారు.అయన వర్క్ లేని ప్రెసిడెంట్ అని..అందుకే అయన మాటలు పట్టించుకోవద్దని తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేశారు.ఇక ఇన్నేళ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్ అవినీతిలో మునిగి సాగునీటి ప్రాజెక్టుల్ని పట్టించుకోలేదని కవిత అన్నారు.

SHARE