కేసీఆర్ బ్యాంకింగ్ పాఠాలు

Posted November 29, 2016, 11:18 am

Image result for kcr
అంశమేదైనా లోతుగా అధ్యయనం చేయడం కేసీఆర్ స్టైల్. సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ఆయన మాట్లాడతారు. ఒకసారి నోరు విప్పారంటే.. అది పెద్ద వార్తే అయ్యితీరాలి. అలా అయితేనే ఆయన మాట్లాడతారు. ప్రస్తుతం ఆయన దృష్టి బ్యాంకింగ్ అంశంపై పడింది. ప్రధాని నరేంద్రమోడీ కూడా నోట్ల రద్దు అంశంపై లోతుగా అధ్యయనం చేశారో.. లేదో.. తెలియదు కానీ.. సీఎం కేసీఆర్ డీప్ గానే స్టడీ చేసినట్టు కనిపిస్తోంది. సోమవారం క్యాబినెట్ సమావేశంలోనూ బ్యాంకింగ్ పైనే ఎక్కువ ఫోకస్ చేశారట కేసీఆర్.

పెద్ద నోట్ల రద్దు తర్వాత తెలంగాణలో జనం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజల కష్టాలను తీర్చేందుకు సరికొత్త ప్రణాళికలను అమలు చేయాలని నిర్ణయించారట కేసీఆర్. ప్రభుత్వం తరపున అధికారికంగా నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు టీఎస్ వ్యాలెట్ ను తీసుకురావాలని నిర్ణయించారు. క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఆయన మీడియా సమావేశంలోనూ నోట్ల రద్దుపై మాట్లాడారు. త్వరలోనే ఆంధ్రాబ్యాంకు రూపే, ఎస్ బీఐ బుడ్డీ తరహాలో టీఎస్ వ్యాలెట్ తీసుకువస్తామని చెప్పారు. ఇది ప్రజల ఆర్థికలావాదేవీలు నెరవేర్చడంలో కీలకపాత్ర పోషించబోతుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు జనమంతా ఇక బ్యాంకింగ్ పైనే దృష్టి పెట్టి.. క్యాష్ లెస్ లావాదేవీలు చేయాలని సూచించారు.

ప్రధాని మోడీకి సైతం సీఎం కేసీఆర్ కొన్ని సలహాలు, సూచనలు చేశారట. ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో తెలిపారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ తన విషయ పరిజ్ఞానంతో మోడీని కూడా ఆకట్టుకున్నారట. బ్యాంకింగ్ పై మరికొన్ని సూచనలు కూడా చేయాలని కోరారట. ఇదేమైనా సీఎం కేసీఆర్ బ్యాంకింగ్ పాఠాల్లో నిజంగానే విషయముంటున్నారు పరిశీలకులు.