Thursday, October 6, 2022
Homelatestమళ్లీ ఆంధ్రాకు కేసీఆర్

మళ్లీ ఆంధ్రాకు కేసీఆర్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు రాష్ట్రాల్లో అందరిలో ఆసక్తి కలిగించే నాయకుడు కేసీఆర్. తిట్టినా, పొగిడినా జనం మనసులో నాటుకుపోయేలా చెప్పడం ఆయనకు రాజకీయంతో తెలిసిన విద్య. అప్పుడెప్పుడో అమరావతి శంకుస్థాపనకు వచ్చిన కేసీఆర్.. మరోసారి ఏపీ జనాలకు కనిపించబోతున్నారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పెళ్లికి హాజరౌతారని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. పెళ్లి విశాఖలో జరుగుతుంది కాబట్టి.. కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత సాగర నగరం వస్తున్నారు.

అమరావతి ప్రోగ్రామ్ తర్వాత కూడా తిరుపతి, విజయవాడ వచ్చినా అవి పూర్తిగా అధికారిక కార్యక్రమాలే. జనంలోకి రాలేదు. ఈసారి కూడా కేసీఆర్ ప్రైవేట్ ప్రోగ్రామ్ కే వస్తున్నా. జనాన్ని కలిసే వీలుందన్న సమాచారం వినిపిస్తోంది. గతంలో అమరావతి రైతులు తమ భూములకు మంచి రేట్లు రావడానికి కేసీఆర్ కారణమని బహిరంగంగా ఫ్లెక్సీలు పెట్టారు. మరి ఇప్పుడు మరో ఐటీ హబ్ గా ఎదుగుతున్న వైజాగ్ వాసులు కూడా ఇంత ఫోకస్ కు కేసీఆర్ కారణమని చెబుతారేమో చూడాలి.

రామ్మోహన్ రాయుడు తండ్రి ఎర్రన్నాయుడితో కేసీఆర్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. మొదట్నుంచి వీరిద్దరూ టీడీపీలో కలిసి పనిచేశారు. తర్వాత కేసీఆర్ పార్టీ నుంచి వెళ్లిపోయినా స్నేహం మాత్రం కొనసాగింది. అందుకే తమ స్నేహాన్ని పురస్కరించుకుని రామ్మోహన్ పెళ్లికి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. సింగిల్ గా వస్తారా.. నేతల్ని తీసుకొస్తారా అనేది కూడా ఆసక్తికరమే.

- Advertisment -
spot_img

Most Popular