జ్యోతి రాధాకృష్ణ తో కేసీఆర్ చెట్టాపట్టాలు..

 Posted April 1, 2017

kcr and abn radhakrishna friendship continuousటీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి బ్యాడ్ టైమ్ నడిచింది. తన ఆప్తమిత్రుడు సీఎం కేసీఆర్ తో రాధాకృష్ణకు ఎక్కడ చెడిందో కానీ .. పరిస్థితి నిషేధం దాకా వెళ్లింది. దాంతో ఆంధ్రజ్యోతిలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేక కథనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

నమస్తే తెలంగాణ, టీ-న్యూస్ కంటే ఎక్కువగా ఆంధ్రజ్యోతిలో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలొస్తున్నాయి. ఇక ఏబీఎన్ ఛానల్ లో అయితే ప్రతిరోజూ కేసీఆర్ పాలనపై రోజూ పాజిటివ్ న్యూస్ కనిపిస్తోంది. రోజూ స్పెషల్ స్టోరీలతో హడావుడి ఎక్కువైంది. ఇవన్నీ చూస్తుంటే ఏబీఎన్ రాధాకృష్ణ- కేసీఆర్ మధ్య కాంప్రమైజ్ జరిగిపోయిందా అన్న వాదన వినిపిస్తోంది.

లేకపోతే అంతలోనే ఎంత మార్పు. ఈ మార్పునకు కేసీఆర్ నిర్వహించిన అయుత చండీయాగం కారణమని ప్రచారం జరుగుతోంది. ఆ యాగానికి రాధాకృష్ణకు ఇన్విటేషన్ వచ్చిందట. నిజానికి అప్పట్లో రాధాకృష్ణ- కేసీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలు లేవు. అయినప్పటికీ ఆహ్వానం రావడంతో ఇక రాధాకృష్ణ కూడా కొంచెం తగ్గారట. దీంతో పాత స్నేహితులు ఇద్దరూ ఒక్కటైపోయారని టాక్. దాని ఫలితంగానే ఏబీఎన్ ఇప్పుడు టీ-న్యూస్ కంటే కూడా ఎక్కువగా కేసీఆర్ గురించి ప్రచారం చేస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఆంధ్రజ్యోతికి సర్కులేషన్ కూడా పెరిగిందన్న వాదన ఉంది. మొత్తానికి ఈ దోస్తీ శాశ్వతంగా ఇలాగే ఉంటుందా? లేక ఎన్నికల నాటికి విడిపోతుందా? అని గుసగుసలాడుకుంటున్నారు టీఆర్ఎస్ క్యాడర్.

SHARE