కేసీఆర్ నోట సినిమా ముచ్చట్లు

Posted October 5, 2016

  kcr appreciated tyagala veena movie team

ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా గడిపే తెలంగాణ ముఖ్యమంత్రి నోట సినిమా ముచ్చట్లు వినిపించాయి. ‘త్యాగాల వీణ’.. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను
నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. రవికుమార్‌ దర్శకుడు. తాజాగా, ఈ చిత్ర ఆడియోని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ‘త్యాగాల వీణ’ చిత్ర బృందాన్ని అభినందించారు. తెలంగాణ ఉద్యమం జరిగిన తీరును భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశం చాలా మంచిందని.. పాటలు బాగున్నాయని ప్రశంసించారు.

ఇదిలావుండగా.. సుమన్‌, శివకృష్ణ, ప్రీతినిగమ్‌, సుమశ్రీ, రాజీ, మధుబాల, ఇంద్ర, రాజీవ్‌.. తదితరులు ప్రధాన పాత్రలో ‘త్యాగాల వీణ’ తెరకెక్కుతోంది.
ఈ చిత్రాన్ని ప్రేమ్‌ మూవీస్‌ పతాకంపై కొత్తపల్లి సతీష్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

SHARE