కేసీఆర్ హీరోగా సినిమా !

 Posted October 20, 2016

 kcr biopic movieతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితమే పోరాటం. ఆయన సంకల్ప బలమే.. ఆయన ఆయుధం. అది చాలా పదునైనది. ఎంతగా అంటే… ఒక్కడే తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి.. ఢిల్లీ పెద్దల మెడలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసుకునేంతగా. ఈ క్రమంలో కేసీఆర్ నడక, యాస, ప్రాస, బాష…  ఇవన్నీ ఆయన అదనపు బలాలు. ఇలాంటి గట్టి సంకల్ప బలం ఉన్న ఓ రాజకీయ నాయకుడి జీవిత గాధ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కిస్తే ఎలాగుంటింది.. బాలీవుడ్ 100 సర్కార్ లని మించుపోదు. ఇప్పుడదే జరగనుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ కి రంగం సిద్ధమైంది. తాజాగా, దర్శకుడు-నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి కేసీఆర్ బయోపిక్ పై ప్రకటన చేశారు….. ‘పెళ్లి చూపులు’ ఫేం రాజ్ కందుకూరి కేసీఆర్ బయోపిక్ ని నిర్మించనున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా ప్రారంభం
కానుంది. ఫిబ్రవరి 17, 2018న కేసీఆర్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

SHARE