ఏపీ లో కెసిఆర్ జన్మదిన వేడుక..

Posted [relativedate]

kcr birthday celebrations at tenali andhra pradesh
ఆంధ్రప్రదేశ్ లో ఓ మూడేళ్ళ కిందట కెసిఆర్ పేరు ఎత్తితే విశేషణంగా తిట్ల దండకమే ఉండేది. కాలం ఎంతటి గాయాన్ని అయినా మాన్పుతుందని…ఎలాంటి మార్పు అయినా రావొచ్చని చెప్పేందుకు మనం చెప్పుకునే విషయం ఓ తిరుగులేని ఉదాహరణ.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ 63 వ జన్మదినం నేడు.ఈ వేడుకలు తెలంగాణ అంతటా ఘనంగా జరిగాయి.ఇందులో విశేషం ఏముంది?ఆ వేడుకలకి దీటుగా ఆంధ్రా పారిస్ గా చెప్పుకునే తెనాలిలో జరిగాయి.అదీ విశేషమంటే..

స్థానిక చెంచుపేటలోని శబరి వృద్ధ ఆశ్రమం కెసిఆర్ బర్త్ డే వేడుకలకి వేదికగా నిలిచింది. కెసిఆర్ అభిమాన సంఘం నేత ఖాదిర్ నేతృత్వాన ఈ పుట్టినరోజు ఉత్సవం నిర్వహించారు.వృద్ధులకు స్వీట్స్ పంపిణీ చేసి తర్వాత అన్నదానం కూడా జరిపారు.ఈ వేడుకలు ఒక్క తెనాలిలోని కాక రెండు రాష్ట్రాల్లోనూ చర్చకు దారి తీయడం ఖాయం.వేడుకలు జరిపిన వారిలో కొందరు చెప్తున్న దాని ప్రకారం కెసిఆర్ వల్ల తెలంగాణ రావడమే కాకుండా …మా ప్రాంతంలో భూముల ధరలు పెరగడంతో పాటు అభివృద్ధి వేగవంతం అయిందని …అందుకనే ఈ వేడుకలు నిర్వహించారు.ఔను అందులో నిజం వుంది కదా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here