Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ అధికార పక్షాన్ని సొంతింట్లోనే దెబ్బ కొట్టాలని బీజేపీ డిసైడైంది. అందుకే కేసీఆర్ అన్న కూతురుకి ఆహ్వానం పలికింది. ఆమె కూడా ప్రముఖ మీడియా సంస్థలకు ఫోన్లు చేసి తాను బీజేపీలోకి వెళుతున్నట్లు చెబుతున్నారు. అమిత్ షా గేమ్ ప్లాన్ చూస్తుంటే.. టీఆర్ఎస్ కు చెమటలు పడుతున్నాయి. అసలు మూడు రోజుల టూర్ తోనే అమిత్ సత్తా తెలిసిపోయిందనుకోండి.
రెండు నెలల్లో మళ్లీ వస్తానని అమిత్ షా చెప్పిన మాట.. ఇంకా కేసీఆర్ చెవుల్లో గింగిరుమంటూనే ఉంది. ఓవైపు మోడీని పొగుడుతూ.. మరోవైపు అమిత్ షా ను తిట్టడానికి కేసీఆర్ చాలా సెంటిమెంట్ పండించారు. కానీ తెలంగాణలో క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తి ఆయన్ను తీరిగ్గా కూర్చోనివ్వడం లేదు. అందుకే ఇటీవల వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ మళ్లీ ఉద్యమ వేడిని గుర్తుచేస్తున్నారు.
బీజేపీని కాంగ్రెస్ లా లైట్ తీస్కుంటే అసలుకే ఎసరు వస్తుందని భావిస్తున్నారు. కేసీఆర్ చెప్పినట్లు తెలంగాణలో బీజేపీకి సత్తా లేకపోయినా.. మళ్లీ మోడీ ప్రధాని ఖాయం అన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. మరి కోరి కొరివితో కేసీఆర్ తల గోక్కుంటారా అనేది వేచి చూడాల్సి ఉంది.రాష్ట్రపతి ఎన్నికల్లో అనూహ్యంగా మద్దతిచ్చి మోడీని కాకా పట్టాలన్నది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది.